గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఐఫా సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి హాజరవనున్నారు. ఈ మేరకు ఆయన మార్చి 8-9 తేదీలలో జరుగనున్న ఈ భారతీయ సినిమా చారిత్రాత్మక వేడుకలలో పాల్గొననున్నారు. ‘ఐఫా 2025 – సిల్వర్ ఈజ్ ది న్యూ గోల్డ్ – 25 గ్లోరియస్ ఇయర్స్ సెలబ్రేట్’ అనే పేరుతో రాజస్థాన్ లోని పింక్ సిటీ జైపూర్‌లో గ్లోబల్ స్టేజ్ వేదికగా ఈ వేడుకలు జరుగనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా.. “IIFA 25 సంవత్సరాలను పురస్కరించుకుని, సిల్వర్ జూబ్లీ ఎడిషన్ గతంలో కంటే గొప్పగా సెట్ చేయబడింది! స్టార్-స్టడెడ్ లైనప్‌కి జోడిస్తూ, బ్లాక్‌బస్టర్ డాకు మహారాజ్ నుండి పవర్‌హౌస్ పెర్ఫార్మర్ అయిన టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ తన ఉనికితో ఈవెంట్‌ను అలంకరించనున్నారు.”
“IIFA 2025 చలనచిత్రం, ఫ్యాషన్ మరియు వినోదం యొక్క వేడుకలో భారతీయ సినిమా నుండి అతిపెద్ద పేర్లను ఒకచోట చేర్చినందున అభిమానులు అద్భుతమైన సాయంత్రాన్ని ఆశించవచ్చు. రాజస్థాన్‌లోని జైపూర్ నడిబొడ్డున భారతీయ సినిమా మరియు ప్రపంచ కళాత్మకత యొక్క ఈ ఐకానిక్ వేడుక కోసం మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోండి.” అని పేర్కొంది.
ఇక ఇదిలావుంటే, ఇటీవలే ‘డాకు మహారాజ్’ సినిమాతో సంచలన విజయం అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ చిత్రంలో నటిస్తున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తోన్న 4వది కావడం గమనార్హం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: