పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ల్యాండ్‌మార్క్ చిత్రం ‘మజాకా’. ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సందీప్ కిషన్‌కి 30వది కావడం గమనార్హం. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మజాకా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్ మరియు రెండు పాటలకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మజాకా నుండి మరో సాంగ్ రిలీజ్ చేసారు. ‘పగిలి’ అంటూ సాగే ఈ మాస్ పార్టీ సాంగ్ ఫుల్ బీట్ తో స్టెప్పులేయించేలావుంది. పార్టీ నేపథ్యంలో వచ్చే ఈ పాట యూత్‌ని ఆకట్టుకునేలావుంది.
మాస్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో త్రినాధ రావు నక్కిన మరోసారి తన మార్క్ చూపించబోతున్నారు. త్రినాధ రావు నక్కినతో విజయవంతమైన ప్రాజెక్టులలో కొలబారేట్ అయిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, మజాకాకు కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ రాస్తున్నారు. ఈ కాంబోలో ఇది మరో మెమరబుల్ ఎంటర్‌టైనర్ అవుతుందని హామీ ఇస్తుంది.
ఇక ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ మ్యూజిక్, ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందిస్తుండగా.. నిజార్ షఫీ డీవోపీగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కాగా మజాకా చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా.. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: