యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ‘తండేల్’ హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ‘తండేల్’ టీం బ్లాక్ బస్టర్ లవ్ సునామీ థాంక్ యూ మీట్ నిర్వహించారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ వేడుకలో నాగాచైతన్య, సాయిపల్లవి స్టేజ్ పై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని విశేషంగా అలరించింది.
ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ.. “మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఈ కథ ఇక్కడే మొదలయింది. మీ లైఫ్ ని స్క్రీన్ పై తీసుకురావడానికి పర్మిషన్ ఇచ్చిన మీ అందరికి థాంక్ యూ. ఇది చాలా స్ఫూర్తివంతమైన కథ. ఈ సినిమా చేయడం నాకు ఓ భాగ్యం. ఇలాంటి కథ నేను చేస్తానని నమ్మినందుకు దర్శక, నిర్మాతలు థాంక్ యూ.” అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ఈ సినిమా మీ అందరికీ నచ్చడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. చైతు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమాపై ఆయన చాలా నమ్మకం పెట్టారు. మా టీం అందరూ చాలా నమ్మకం పెట్టుకున్నాం. మా నమ్మకం నిజమైనందుకు చాలా ఆనందంగా వుంది” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: