యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ‘తండేల్’ హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ‘తండేల్’ టీం బ్లాక్ బస్టర్ లవ్ సునామీ థాంక్ యూ మీట్ నిర్వహించారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ వేడుకలో నాగాచైతన్య, సాయిపల్లవి స్టేజ్ పై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని విశేషంగా అలరించింది.
ఇక ఈ థాంక్ యూ మీట్‌లో హీరో అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ.. “తండేల్ సినిమా ప్రయాణం శ్రీకాకుళంతోనే మొదలయింది. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా వుంది. చందు, కార్తిక్ ఐడియా చెప్పినప్పుడు మొదట ఇక్కడికే వచ్చాను. మీతో మాట్లాడిన తర్వాత తండేల్ రాజు క్యారెక్టర్‌కి ఒక డిజైన్ దొరికింది. ఈ రోజు ఆ క్యారెక్టర్‌కి అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే అది మీ వల్లే. మీ అందరికీ థాంక్స్.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “శ్రీకాకుళం ఓ అద్భుతం. నాకు శ్రీకాకుళం యాస చాలా ఇష్టం. దద్దా చెప్పాను కదా ఈపాలి యేట దుల్లగొట్టేద్దామని. మన తండేల్ సినిమా ఇక రాజులమ్మ జాతరే. సాయి పల్లవికి థాంక్ యూ. వాసు గారు, అరవింద్ గారు లేకపొతే ఈ జర్నీ వుండేది కాదు. థాంక్ యూ శ్రీకాకుళం, లవ్ యూ ఆల్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: