రివ్యూ: లైలా

Laila Movie Telugu Review

నటీనటులు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ, పృథ్వీరాజ్, అభిమన్యు సింగ్, వినీత్ కుమార్ తదితరులు
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్ర‌ఫీ: రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: సాగర్ దాడీ
నిర్మాణం: షైన్ స్క్రీన్స్ బ్యానర్‌
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ ‘మాస్ కా దాస్’ విశ్వక్సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్‌ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించడం విశేషం. ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో విడుదలకు ముందే మార్కెట్‌లో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేడు థియేటర్లలోకి వచ్చేసింది.

అయితే ఈ సినిమా కథ ఏంటి? సోను మోడల్, లైలా అనే రెండు పాత్రల్లో విశ్వక్ ఎలా నటించాడు? లేడి గెటప్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ ఎలావుంది? అసలు ఆయన లేడీ వేషం వేయడానికి కారణం ఏంటి? ఇంతకూ లైలా ప్రేక్షకులను మెప్పించిందా? మళ్లీ ఈ సినిమాతో విశ్వక్ సక్సెస్ బాట పట్టినట్టేనా? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:-

కథానాయకుడు సోనూ మోడ‌ల్ (విశ్వ‌క్‌సేన్‌) ఓ బ్యూటీషియ‌న్‌. హైదరాబాద్ పాతబ‌స్తీలో సొంతంగా ఒక బ్యూటీపార్ల‌ర్ రన్ చేస్తుంటాడు. పనిమంతుడు కావడంతో చాలామంది అమ్మాయిలు అతనితో మేక‌ప్ వేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక తన పార్ల‌ర్‌కి వ‌చ్చే ఆడవాళ్ళని అక్కా అని ఆప్యాయంగా పిలుస్తుంటాడు సోనూ. స్వతహాగా మంచివాడు కాబట్టి వారిలో ఎవరికైనా ఏదయినా కష్టమో.. సహాయమో కావాల్సివచ్చినప్పుడు ఆదుకొంటుంటాడు.

ఈ క్రమంలో తన దగ్గరకు వచ్చే ఒక మహిళ క‌ష్టంలో ఉందని తెలుసుకుని ఆర్థిక స‌హాయం చేసి, ఆదుకొంటాడు. అయితే అనూహ్యంగా ఆమె వ‌ల్లే క‌ల్తీ నూనెల స్కామ్‌లో ఇరుక్కొంటాడు. ఒక వేడుకలో ఈ క‌ల్తీ నూనెతో చేసిన విందు ఆరగించి అనేకమంది ఆసుప‌త్రి పాలవుతారు. వారిలో స్థానిక ఎమ్మెల్యే కూడా ఉంటాడు. దీంతో ఆయన అనుచరులు సోనుపై పగబడతారు.

ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే బారినుంచి త‌ప్పించుకోవ‌డానికి సోనూ ‘లైలా’ అనే అమ్మాయిగా వేషం మారుస్తాడు. అయితే ఆ త‌రువాత ఏం జరిగింది? తనకి ఈ పరిస్థితి రావడానికి కారణమైన కల్తీ నూనె స్కామ్ వెనుక ఎవరున్నారో కనిపెట్టగలిగాడా? లైలాగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? కథానాయిక (ఆకాంక్ష శర్మ)తో తన లవ్ ఏమైంది? చివరికి ఏమయింది? అనేది మిగిలిన క‌థ‌.

విశ్లేషణ:-

ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా లైలాను రూపొందించాడు దర్శకుడు రామ్ నారాయణ్. ఇందుకు తగ్గట్ఠే ఫస్టాఫ్ అంతా సరదా సరదా సన్నివేశాలతో సాగిపోతుంది. ఇక సెకండాఫ్ అక్కడక్కడా కొంచెం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. కాకపోతే విశ్వక్ కనిపించే సీన్స్ ఎంగేజింగ్‌గా అనిపిస్తాయి. లేడీ గెటప్‌లో ఆయన చేసే హంగామా సినిమాను నిలబెట్టింది. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా ముగించాడు దర్శకుడు.

ఇక నటీనటుల విషయానికొస్తే.. ఇప్పటివరకూ ఒక మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఈ సినిమాతో ఆ ఇమేజ్ మార్చుకోవడానికి సిన్సియర్‌గా ప్రయత్నం చేసాడు. ఇకపై లవర్ బాయ్, సాఫ్ట్ క్యారక్టర్స్ కూడా చేయగలనని నిరూపించుకుంటాడు. అలాగే ఇటీవలికాలంలో హీరోలెవ్వరూ చేయని సాహసం చేసాడు. లేడీ వేషంలో కనిపించి సర్‌ప్రైజ్ చేయడమే కాకుండా ఆ పాత్రలో ఆయన తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

అలాగే హీరోయిన్ ఆకాంక్ష శర్మ అందంగా కనిపించింది. తనది చిన్న పాత్రే అయినా ఉన్నంతసేపూ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఇతర నటులు పృథ్వీరాజ్, అభిమన్యు సింగ్, వినీత్ కుమార్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు డీసెంట్‌గా నటించారు. ముఖ్యంగా పృథ్వీరాజ్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించగా.. అభిమన్యు సింగ్ ఇప్పటివరకూ చేయని డిఫరెంట్ పాత్రలో కనిపించాడు.

ఇక సినిమా టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్ లో ఉంది. టెక్నిషియన్స్ విషయానికొస్తే.. లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకు ప్లస్ అయిందని చెప్పొచ్చు. సాంగ్స్ కూడా వినసొంపుగా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ కూడా చెప్పుకోదగ్గట్టుగా ఉంది. ఇలాంటి స్టోరీకి ఎలాంటి సంగీతం కావాలో లియోన్ జేమ్స్ అదే ఇచ్చాడు.

ఇంకా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఎస్సెట్ అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా అనిపిస్తుంది.విజువల్స్, లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. విశ్వక్ లేడీ గెటప్‌లో బావున్నాడంటే అందుకు కెమెరా వర్కే కారణం. అలాగే సాగర్ దాడీ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉండి నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.

ఓవరాల్‌గా చూస్తే, లైలా సినిమా ఆడియెన్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ కేవలం యూత్ అనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. ఈ మూవీ విశ్వక్ సేన్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది. ఆయన ఈ మూవీతో హిట్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.