మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లేడీ గెటప్ చేయాలనే కోరిక మీకు ముందునుంచి ఉందని విన్నాం?
- ఆర్టిస్ట్ గా కొన్ని పాత్రలు చేయాలని ప్రతి నటుడికి ఉంటుంది.
- భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం, రెమో సినిమాలు చూసినప్పుడు ఆర్టిస్టుగా ఇలాంటి గెటప్ చేయాలని ఉండేది.
- అలాగే ఆడియన్స్ ఇప్పుడు కొత్త కథలని, థీమ్స్ ని కోరుకుంటున్నారు.
- ఇలాంటి సినిమాలురాక దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతుంది.
- ఈ జనరేషన్ లో ఒక హీరో అమ్మాయి పాత్ర వేయడం గత 20 ఏళ్లుగా మనం చూడలేదు.
- ఆ లోటుని భర్తీ చేయాలని ఒక మంచి కథ రావడంతో ఈ సినిమా చేయడం జరిగింది.
సోను మోడల్, లైలా ఈ రెండు క్యారెక్టర్స్‌లో మీకు ఇష్టమైనది?
- డెఫినెట్‌గా లైలా. కానీ సోను క్యారెక్టర్ కూడా మీరు ఫాన్స్ అయిపోతారు.
- ట్రైలర్, పబ్లిసిటీలో లైలా డామినేట్ చేస్తుంది.
- స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాత్రం సోను క్యారెక్టర్‌ని కూడా చాలా ఇష్టపడతారు.
- ఫస్ట్ హాఫ్‌లో సోను మోడల్ లైఫ్ స్టైల్‌ని తన క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు.
అసలు సోను, లైలాగా మారడానికి కారణమేమిటి?
- ఒకటి కాదు మొత్తం మూడు ప్రాబ్లమ్స్ వస్తాయి.
- ఆ మూడు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి లైలాగా మారుతాడు.
- అది ఏంటనేది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి.
లేడీ గెటప్ లోకి మారడానికి మీకు ఎంత సమయం పట్టింది?
- దాదాపు రెండున్నర గంటలు పట్టేది.
- మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు.
- లేడీ గెటప్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేలా ఉండదు.
- చాలా నేచురల్‌గా వచ్చింది.
ట్రైలర్‌లో ఎక్కువ అడల్ట్ కంటెంట్ కనిపిస్తుంది?
- అడల్ట్ కాదండి. ఇది యూత్ ఫుల్ కంటెంట్.
- కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్.
ఈ కథ విన్న్నప్పుడు మీ ఇనిషియల్ ఇంప్రెషన్ ఏంటి?
- కథ చెప్పినంత సేపు విపరీతంగా ఎంజాయ్ చేశాను.
- ఇలాంటి నవ్వులు జనాలకి ఎందుకు ఇవ్వకూదని అనిపించింది.
- ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్ గానే వింటాను.
- కానీ ఈ కథ విన్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను.
మీరు కాంపౌండ్ కామెంట్ విషయంలో ఇచ్చిన సమాధానం గురించి చిరంజీవి గారు ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రస్తావించడం ఎలా అనిపించింది?
- నాకు చాలా ముచ్చటేసింది, నేను అక్కడితో అది ఎండ్ అయిపోయింది అనుకున్నాను.
- కానీ నా ఉద్దేశాన్ని చిరంజీవి గారు కూడా ప్రస్తావించడం చాలా ఆనందంగా అనిపించింది.
- అందరం అందర్నీ సపోర్ట్ చేసుకోవాలి. అంతిమంగా మనం మంచి సినిమాల్ని ఆడియన్స్‌కి ఇవ్వాలి.
- సినిమా మీద ప్రేమతోనే అందరం ప్రయాణిస్తున్నాం.
ఈ సినిమాకి లిరిక్స్ రాయడం ఎలా అనిపించింది?
- మొహమాటం ఏమీ లేదు. నేను రాస్తాను. బాగుంటే పెట్టుకోండి అని డైరెక్టర్‌తో చెప్పాను.
- ఆయనకి నచ్చి సినిమాలో పెట్టడం జరిగింది. బేసిక్‌గా నాకు రాయడం ఇష్టం.
లైలా గెటప్‌లో మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు సర్‌ప్రైజ్ అయ్యారని విన్నాం?
- వాళ్లు చాలా ఎంజాయ్ చేశారు. నువ్వులు వెక్కిరింతలు అన్నీ జరిగాయి.
- ఇంట్లో వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ వేరు. (నవ్వుతూ) మా అత్త, మమ్మీ మ్యాచింగ్ చీరలు కట్టుకొని వచ్చారు.
మీనాక్షి క్యారెక్టర్ గురించి?
- తనది చాలా సర్‌ప్రైజింగ్ రోల్. అద్భుతంగా యాక్ట్ చేసింది.
- అభిమన్యు సింగ్ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది.
- ఆయన కెరీర్‌లో ఇది చాలా డిఫరెంట్ రోల్.
- ఇది ఈ రెండు కాకుండా ఇంకొక సర్‌ప్రైజింగ్ యాక్టర్ కూడా ఇందులో ఉన్నారు.
- ‘గుళ్ళు దాదా’ క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేస్తారు.
లైలా క్యారెక్టర్‌లో ఫైట్ చేయడం ఎలా అనిపించింది?
- చీర, హై హీల్స్‌లో ఫైట్ ఎంత కష్టంగా ఉంటుందో మీరే ఊహించుకోండి.
- దాన్ని ఒక స్టైల్‌లో చేసాము. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
మోపిదేవి సుబ్రహ్మణేశ్వర స్వామి దర్శనం ఎలా జరిగింది?
- బ్రహ్మాండంగా జరిగింది. ముందురోజు మిడ్‌నైట్ వరకు లాండింగ్ అనుమతి లేదు.
- అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయవలన మిడ్‌నైట్ 6 క్లియరెన్స్‌లో వచ్చాయి.
- సుబ్రమణ్యేశ్వర స్వామియే నన్ను అక్కడికి పిలిపించుకున్నారు.
- కృష్ణాజిల్లా రెస్పాన్స్ చాలా వైల్డ్‌గా ఉంది.
- స్పీకర్లు మింగేసినట్టు అరుస్తున్నారు.
నిర్మాత సాహు గారి గురించి?
- సాహు గారు సినిమా క్రాఫ్ట్ తెలిసిన నిర్మాత.
- నేను ఈ క్యారెక్టర్ చేయగలని ముందు నమ్మింది ఆయనే.
- ఫ్యూచర్‌లో కూడా మా జర్నీ ఉటుంది.
- టెక్నికల్‌గా సినిమా బ్రిలియంట్‌గా వుంటుంది.
- రిచర్డ్ ప్రసాద్ అమెజింగ్ విజువల్స్ ఇచ్చారు.
- లియోన్ జేమ్స్ సాంగ్స్‌కి వండర్‌ఫుల్ రెస్పాన్స్ వచ్చింది.
- థియేటర్స్‌లో ఇంకా ఎంజాయ్ చేస్తారు.
- మా టీం అంతా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాం.
లైలాకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?
- చిరంజీవి గారు స్టేజ్ మీద ‘నాకే కొరకాలనిపిస్తుందని’ చెప్పడం బెస్ట్ కాంప్లిమెంట్.
- లైలా నా కెరీర్‌లో గుర్తిండిపోయే సినిమా అవుందనే నమ్మకంతో చేశాను.
లైలా గెటప్ ప్రమోషన్స్ చేస్తే బావుండేది కదా?
- లైలాని బిగ్ స్క్రీన్ పైనే చూడాలి. అయితే లైలా గెటప్ మళ్ళీ వెయ్యాలనివుంది.
- ఇందులో సీక్వెల్‌కి పనికొచ్చే మంచి క్లిప్ హ్యంగర్ సీన్ వుంది.
- మంచి రెస్పాన్స్ వస్తే, సెకండ్ వీక్‌లో యాడ్ చేస్తాం.
హారర్ సినిమా చేయాలని ఉందా?
- భయపడదామని చాలా సార్లు థియేటర్‌కి వెళ్లాను.
- ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా భయపెట్టలేదు.
- నేను హారర్ సినిమా చేయకపోవచ్చు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?
- ఈ మంత్ ఎండ్ నటులని పరిచయం చేస్తున్నాం.
- ఫంకీ మూవీ ఇమ్మిడియట్‌గా స్టార్ట్ చేస్తున్నాం.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: