అగత్యా ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్

Jiiva and Arjun Sarja's Aghathiyaa Trailer Receives Superb Response

ట్యాలెంటెడ్ హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్‌ సర్జా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్యా’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా బ్యానర్స్‌పై ఇషారి కే గణేష్‌, అనీష్ అర్జున్ దేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మేకర్స్ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ‘సుమారు 120 సంవత్సరాల క్రితం బ్రతికిన ఆత్మలని మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారు’ అనే వాయిస్‌తో మొదలైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్‌తో సర్‌ప్రైజ్ చేసింది. సినిమా కాన్సెప్ట్, హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్, బ్యాక్‌డ్రాప్ నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ అందించాయి. జీవా, అర్జున్‌ సర్జా ఎక్స్‌ట్రార్డినరీ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. రాశీఖన్నా ప్రజెన్స్ చాలా ఇంట్ద్రటింగ్‌గా వుంది.

దర్శకుడు పా. విజయ్‌ యూనిక్ కాన్సెప్ట్‌తో థ్రిల్ చేయబోతున్నాడని ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. యువన్ శంకర్ రాజా బీజీఎం మరో హైలెట్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫాంటసీ హారర్ ఎలిమెంట్స్‌ని మరింత ఎలివేట్ చేసింది. దీపక్ కుమార్ పాఢి కెమరా వర్క్ కట్టిపడేసింది. నిర్మాణ విలువలు టాప్ క్లాస్‌లో వున్నాయి.

‘అవేంజర్స్‌’ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఫాంటసీ థ్రిల్లర్ ‘అగత్యా’. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. సినిమాను చూసే ప్రతి ఒక్కరికీ సరికొత్త అనుభూతిని అందిస్తుంది, అని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రంలో ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్, యోగి బాబు, VTV గణేష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

స్టార్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు, పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. దీపక్ కుమార్ పాఢి డీవోపీగా పని చేసిన ఈ సినిమాకి షాన్ లోకేష్ ఎడిటర్. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన ‘అగత్యా’ ఫిబ్రవరి 28, 2025న తమిళం, తెలుగు, హిందీ భాషలలో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.