రీ రిలీజ్‌కు సిద్దమైన సూర్య సన్నాఫ్ కృష్ణన్

Surya Son of Krishnan Movie Ready For Rerelease

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ద్విపాత్రాభినయంలో సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. తమిళ్ లో ‘వారనమ్ అయిరమ్’ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ గా డబ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2008 నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం తమిళ్ కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. ఆ మధ్య రీ రిలీజ్ చేస్తే అప్పుడూ అద్భుతమైన విజయం అందుకుందీ సినిమా. తాజాగా ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి విడుదల కాబోతోంది. తెలుగులో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సందర్భంగా తెలుగు అనువాద బ్యానర్ సి.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ హౌస్ వారు మాట్లాడుతూ.. ”సూర్య సన్నాఫ్ కృష్ణన్ తెలుగులో ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలవుతోంది. ఈ మూవీలో సూర్య అద్భుతమైన నటన చూపించారు. గౌతమ్ మీనన్ ప్రేమ నేపథ్యంలో ఓ కళాఖండాన్ని సృష్టించారు. హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇప్పటికీ అన్ని వేదికలపైనా ఈ మూవీ పాటలు లేకుండా కనిపించదు.”

“అంతటి ప్రజాదరణ పొందిన పాటలున్న చిత్రం ఇది.పివిఆర్ థియేటర్స్ వాళ్లు ఒక కంటెస్ట్ లవర్స్ డే వీక్ అనే ప్రోగ్రామ్ చేశారు. ఆ వీక్ లో తెలుగు నుంచి సూర్య సన్నాఫ్ కృష్ణన్ ను 12న ప్రదర్శించబోతున్నారు. ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయిన కాసేపట్లోనే ఫుల్ అవుతోంది.13న మరో షో వేస్తున్నారు. అది కూడా ఫుల్ అవుతోంది. ప్రేక్షకులకు ఇది అంతటి ఇష్టమైన సినిమా ఇది. ఇక 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ లోనూ విడుదల కాబోతోంది.”

“ఈ రెండు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలతో పాటు తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్శీస్ మొత్తం మేమే విడుదల చేస్తున్నాము.టోటల్ గా 300లకు పైగా షోస్ ను ప్లాన్ చేశాం. యూత్ అంతా ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీని బూస్ట్ చేస్తోన్న పివిఆర్ కు థ్యాంక్స్ చెబుతున్నాము. 12, 13 తేదీల్లో ప్రదర్శనలున్నా.. 14న చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాము. ఈ మూవీలోని 7 పాటలూ యూత్ కు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పాలి. ఇలాంటి చిత్రాన్ని విడుదల చేయడం మా సంస్థకు గర్వకారణం అని చెబుతున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.