విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ ‘శారీ’ లాగ్ లైన్: ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో, ఆర్జీవీ-ఆర్వి ప్రొడక్షన్స్ LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా పలు నిజజీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘శారీ’ మూవీ రూపొందుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఈ ఉదయం 10 గంటలకు RGV డెన్‌లో ‘శారీ’ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ‘మాంగో మీడియా’ ద్వారా విడుదల చేసారు.
దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ తన ఎమోషనల్ వాయిస్‌తో.. “సోషల్ మీడియాలో ఏవరెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకుని, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గాని, ఫోర్‌గ్రౌండ్ గాని, ఏమి తెలియకుండా నమ్మేయడంతో.. ఎదురయ్యే ప్రమాదాలు, భయంకర సంఘటనలు, మనం చాలా చాలా విన్నాం! చూసాం!! అలాంటి నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన సినిమా ఈ ‘శారీ’.” అంటూ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో చెప్పారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవి శంకర్ వర్మ మాట్లాడుతూ “మా ‘శారీ’ చిత్రం నుంచి ఇప్పటివరకూ టీజర్, ‘ఐ వాంట్ లవ్’ అండ్ ‘ఎగిరే గువ్వలాగా..’ రెండు లిరికల్ సాంగ్స్ విడుదల చేసాము. వీటికి సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఈ రోజు ట్రైలర్ ‘మాంగో మీడియా’ ద్వారా తెలుగు, హిందీ, తమిళ మరియు మళయాళ భాషల్లో విడుదల చేసాము. కాగా ఈ థ్రిల్లర్ సినిమాను ఈ నెల 28న అన్ని ప్రధాన భాషల్లో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: