యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు. కింగ్ అక్కినేని నాగార్జున ఈ వేడుక ముఖ్య అతిధిగా హరజయ్యారు. నిర్మాత అశ్వినీదత్ స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ వేడుకలో నాగచైతన్య, శోభితా దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తండేల్ విశేషాలను పంచుకున్నారు. అరవింద్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. మాట్లాడుతూ.. మా యూనిట్ ని బ్లెస్ చేయడానికి వచ్చిన నాగార్జున గారికి థాంక్ యూ. నా చిరకాల మిత్రుడు అశ్వినీదత్ ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. చందు ఈ సినిమా అద్భుతంగా చూపించారు. మా బ్యానర్ లో కలకాలం నిలిచిపోయే సినిమా ఇచ్చారు. సాయిపల్లవికి థాంక్ యూ.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “చైతు పర్ఫార్మెన్స్ ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడే అద్భుతం అనిపించింది. అందుకే ఈ సినిమా తన కెరీర్ లో మరో ఎత్తు అని చెప్పాను. వెడ్డింగ్ కార్డ్ సీన్ లో తన నటన అద్భుతం. ఈ సినిమా పూర్తయిన వరకు మరో సినిమా గురించి అలోచించలేదు. అలాగే చైతు తన భార్యని ఈ వేడుకు తీసుకురావడం మహాదానందంగా అనిపించింది. వెల్ కం యూ అమ్మా.. మా హీరో బుజ్జితల్లి.(నవ్వుతూ). దేవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సినిమాని ప్రేమించి బీజీఎం చేశాడు. 25ఏళ్ళుగా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తూనే వున్నాడు. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























