మూవీ లవర్స్ అంటే.. తెలుగు ప్రేక్షకుల తర్వాతే!

Naga Chaitanya Thanked Telugu Audience For Their Support to Thandel

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు. కింగ్ అక్కినేని నాగార్జున ఈ వేడుక ముఖ్య అతిధిగా హరజయ్యారు. నిర్మాత అశ్వినీదత్ స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ వేడుకలో నాగచైతన్య, శోభితా దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగచైతన్య తన ఎక్స్ పీరియన్స్ షేర్ చేసుకున్నారు. చైతూ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “పెద్దలకు, మీడియా మిత్రులకు, అభిమాన దేవుళ్ళకు, అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు ఎంతో ఇష్టమైన, కష్టమైన జర్నీ. కార్తిక్ చందు ఈ ఐడియా చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను. తర్వాత శ్రీకాకుళం వెళ్లాం. అక్కడ ఇది ఎంత కష్టమైన జర్నీ, ఎంత బాధ్యత వుంటుందో అర్ధమైయింది.”

“ఒక నటుడికి ఇంలాంటి పాత్ర చాలా అరుదుగా దొరుకుతుంది. ఎలాగైనా సక్సెస్ చేయాలని ఈ జర్నీ మొదలుపెట్టాం. ఈ సినిమాకి ఆడియన్స్, ఫ్యాన్స్, మీడియా నుంచి వచ్చిన రెస్పాన్స్ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. రిలీజ్ కి ముందు కొంచెం భయపడ్డాను. చందు వాసు అరవింద్ గారు నాకు ఎంతో ధైర్యం ఇచ్చారు. ఇది నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అని చెప్పారు. నేను కూడా బలంగా నమ్మాను.”

“100 పెర్సెంట్ లవ్ నా కెరీర్ ఎలాంటి బూస్ట్ ఇచ్చిందో ఈ సినిమాకూడా అలాంటి బూస్ట్ ఇస్తుందని బిలివ్ చేశాను, అదే జరిగింది. చందు కి థాంక్ యూ. సినిమా అంత చాలా సపోర్ట్ చేస్తూ తీసుకెళ్ళారు. అల్లు అరవింద్ గారు, వాసు సపోర్ట్ మర్చిపోలేను. సినిమా రిలీజైన తర్వాత సినిమాని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లడానికి గీత ఆర్ట్స్ చేసే ప్రమోషన్ ఎంతో హెల్ప్ అయ్యింది.”

“నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ వచ్చింది. సినిమా లవర్స్ అంటే సినిమా తెలుగు ప్రేక్షకుల తర్వాతే. మంచి కంటెంట్ ఇస్తే ఎలా ఆదరిస్తారో మరోసారి చూపించారు. ఈ సినిమాని కథని దేవి అద్భుతంగా అర్ధం చేస్తున్నారు. ఆయన నాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరున థాంక్ యూ. ఇంత మంచి హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.