నేచురల్ స్టార్ నాని ఆధ్వర్యంలోని ‘వాల్ పోస్టర్ సినిమా’ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందే చిత్రాలను నిర్మించడంలో పేరు తెచ్చుకుంది. నాని ప్రెజెంటర్‌గా ఉన్న ఈ బ్యానర్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులకు థ్రిల్ పంచేందుకు సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొత్త దర్శకుడు రామ్ జగదీష్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ ‘కోర్ట్ – స్టేట్ vs ఎ నోబడీ’ అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ ఎక్సయిటింగ్ మూవీలో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు ప్రియదర్శి లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. టైటిల్ పోస్టర్‌తోనే సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని శాంతి తిపిర్నేని నిర్మిస్తుండగా, దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. త్వరలో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానున్నట్టు ప్రకటించారు. ‘ప్రేమలో’ అంటూ సాగే ఈ సాంగ్ ముఖ్య పాత్రధారులు హర్ష్ రోషన్, శ్రీదేవి మధ్య డ్యూయెట్‌గా రూపొందినట్టు తెలుస్తోంది. ప్రియదర్శి న్యాయవాదిగా కనిపించనున్నాడు.
ఈ సినిమా కథాంశం చట్టపరమైన ఆరోపణలో చిక్కుకున్న అబ్బాయి చుట్టూ వుంటుంది, న్యాయం, సత్యం కోసం పోరాటంగా వుంటుంది. బలమైన కథాంశంతో, ఈ చిత్రం ఆలోచింపజేసేదిగా ఉంటుందని, న్యాయ వ్యవస్థలో న్యాయం, న్యాయం కోసం అన్వేషణ గురించి కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని హామీ ఇస్తుంది.
కాగా ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తవుతుండగా, హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. విఠల్ కోసనమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు రామ్ జగదీష్‌తో కలిసి, కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగిరి స్క్రీన్‌ప్లే రాశారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: