మెగా స్టార్ చిరంజీవి , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానుంది. ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించకపోయినా పలు ఇంటర్వ్యూ ల్లో అనిల్ తన నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది రివీల్ చేశాడు.ఇక నిన్న లైలా ఈవెంట్ లో చిరంజీవి కూడా ఈ సినిమాను కంఫర్మ్ చేశాడు.అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నానని సమ్మర్ నుండి స్టార్ట్ అవుతుందని చెప్పారు.సో వీరిద్దరి కాంబో లో సినిమా ఫిక్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే చిరంజీవి ,దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా సినిమా చేయనున్నాడు.అఫీషియల్ గా ప్రకటించారు కూడా. కానీ చిరు ఫస్ట్ అనిల్ తో సినిమాను పూర్తి చేయనున్నాడు. తక్కువ సమయంలో సినిమాను ఫినిష్ చేయడం లో అనిల్ దిట్ట.సంక్రాంతి వస్తున్నాంను కేవలం 75రోజుల్లో పూర్తి చేశాడు.ఆ లెక్కన ఈఏడాది చివరి కల్లా సినిమా పూర్తి కానుంది.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది ఈసినిమా.చిరు కోసం అనిల్, రౌడీ అల్లుడు టైపు స్టోరీ ని సిద్ధం చేశాడట.షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించనున్నాడు.త్వరలోనే ఈసినిమాను లాంచ్ చేయనున్నారు.
ఇక ప్రస్తుతం చిరంజీవి, విశ్వంభర లో నటిస్తున్నాడు.వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.మే 9న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: