‘మాస్ కా దాస్’ విశ్వక్‌సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. లైలా టీం కి నా బెస్ట్ విషెస్. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి సినిమా రిలీజ్ కాబోతుంది. అందరు వెళ్లి సినిమాని ఎంజాయ్ చేసి పెద్ద సక్సెస్ ఇవ్వాలి. విశ్వక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను లైలాగా మారిన వీడియో చూసినప్పుడు తన పడిన కష్టం కనిపించింది. ఒక హీరో హీరోయిన్ గా మారి ట్రై చేసిన చాలా సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అంత స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సాహు నా మిత్రుడు. మేము బాలయ్య బాబు గారితో సినిమా చేసాం. మళ్ళీ మా ఇద్దరం కలిసి చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నాం. చిరంజీవి గారు రీసెంట్ గా బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఇది మెమొరబుల్ జర్నీ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఒక జనరేషన్ ని శాసించిన గొప్ప స్టార్ చిరంజీవి గారు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్ కి కల. నాకు ఆ అవకాశం వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత చిరంజీవి గారితో చేయబోయే సినిమా కోసం చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాను” అని చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: