నాగ చైతన్య తండేల్ నిన్న మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ అనే మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఈసినిమా 21.27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అక్కినేని హీరోల కెరీర్ లోనే ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.ఇక ఈరోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు నార్త్ అమెరికాలోనూ సూపర్ గా స్టార్ట్ చేసింది.ఇప్పటివరకు అక్కడ హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. ఈ వారాంతంలో మిలియన్ క్లబ్ లో చేరనుంది.వాస్తవిక సంఘటనల ఆధారంగా చందు మొండేటి తెరకెక్కించిన ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.నాగ చైతన్య , సాయి పల్లవి నటన కు తోడు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.గీతా ఆర్ట్స్ ఈసినిమాను నిర్మించింది.
ఇక ఈసినిమాతో నాగ చైతన్య వరస పరాజయాలకు బ్రేక్ పడింది.తండేల్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలువనుంది.త్వరలోనే తండేల్ సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. దీనికి కింగ్ నాగార్జునను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: