నటీనటులు: అజిత్ కుమార్, త్రిష కృష్ణన్, అర్జున్ సర్జా, ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు
సంగీతం: అనిరుద్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
ఎడిటింగ్: ఎన్.బి. శ్రీకాంత్
నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్
నిర్మాత: సుభాస్కరన్
దర్శకత్వం: మగిళ్ తిరుమేని
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు ‘థల’ అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విడాముయార్చి’. దీనిని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP ‘పట్టుదల’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. ‘కలగ తలైవన్’ ఫేమ్ మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ మూవీ అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఆసక్తి క్రియేట్ చేసింది.
ఈ నేపథ్యంలో పట్టుదల చిత్రం భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకువచ్చింది. కోలీవుడ్ మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుద్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించాడు. ఇందులో అజిత్ మరోసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించారు. అయితే ఇంతకూ ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? ‘థల’ అభిమానులను అలరించాడా? అనేది తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
కథ:-
అజర్ బైజాన్ దేశంలోని బాకు నగరంలో కథానాయకుడైన అర్జున్ (అజిత్ కుమార్), కాయల్ (త్రిష) ని ప్రేమ వివాహం చేసుకుని జీవిస్తుంటాడు. 12 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో భర్తతో విడిపోవాలనుకుంటుంది కాయల్. అంతే కాదు మరో వ్యక్తితో ప్రేమలో పడుతుంది. దీంతో విడాకులకు అర్జున్ అంగీకరిస్తాడు. అయితే ఈలోగా తన పుట్టింట్లోనే ఉండాలనుకుని నిర్ణయించుకుంటుంది.
ఈ క్రమంలో తానే స్వయంగా పుట్టింట్లో డ్రాప్ చేస్తానని, ఇదే మనం కలిసి చేసే చివరి మెమరబుల్ జర్నీ అని చెప్పి అర్జున్ కాయల్‌ను కారులో తీసుకెళ్తాడు. ఈ ప్రయాణంలో వారికి మార్గ మధ్యంలో దీపికా (రెజీనా), రక్షిత్ (అర్జున్) పరిచయమవుతారు. అయితే ఆ తర్వాత కాయల్ మిస్ అవుతుంది. అక్కడి నుంచి ఏం జరిగింది. దీని వెనుక ఉన్నది ఎవరు? కిడ్నాప్ అయిన తన భార్య కాయల్‌ను అర్జున్ ఎలా దక్కించుకున్నాడు అన్నది కథ.
విశ్లేషణ:-
డైరెక్టర్ మగిళ్ తిరుమేని పట్టుదల కథను రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ ఫార్మాట్‌లో సర్వైవల్ థ్రిల్లర్ జానర్‌లో రాసుకున్నాడు. అందుకు తగ్గట్టే ఈ కథ ఇంటర్వెల్ వరకు ఒకలా ఉంటే ఆ తరువాత మరోలా ఉంటుంది. తొలిభాగంలో ఒక అందమైన ప్రేమ కథను చూపించిన డైరెక్టర్, ఇంటర్వెల్ తర్వాత ఒక్కసారిగా యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. తనదైన స్క్రీన్ ప్లేతో ఫాస్ట్ పేస్డ్ ఫిల్మ్‌గా మగిళ్ చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు.
‘గ్యాంబ్లర్’ తర్వాత అజిత్, అర్జున్ కాంబినేషన్‌పై ఏర్పడిన అంచనాలను ఈ సినిమా మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. వీరిద్దరి మధ్య వచ్చే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఈ మూవీలో కూడా వర్కవుట్ అయింది. ముఖ్యంగా అజిత్ వర్సెస్ అర్జున్ మధ్య వచ్చే ట్రైన్ ఫైట్ సీన్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ ఫైట్ సీక్వెన్స్ అయితే థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. అలాగే సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ప్రధానంగా సినిమా సెకండాఫ్ ఆడియెన్స్‌ను బాగా ఎంగేజ్ చేసేలావుంటుంది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకుని అగ్రహీరోలలో ఒకడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో సీనియర్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ లను పక్కన పెడితే.. ‘దళపతి’ విజయ్, ‘థల’ అజిత్ ఇద్దరి మధ్యే టైట్ ఫైట్. ఈ ఇద్దరూ గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నారు. తమిళనాట ఇద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అయితే విజయ్ యిప్పుడు తన చివరి చిత్రాన్ని చేస్తున్నాడు. దానితర్వాత రాజకీయాల్లోకి వెళ్తున్నాడు. సో.. ముందుముందు అజిత్‌కి గట్టి పోటీ అనేది ఉండకపోవచ్చు. ఈ క్రమంలో పట్టుదల చిత్రం విడుదలకావడం ఆసక్తికరంగా మారింది. కేవలం తన కళ్ళతో, ముఖంలో హావభావాలతో అద్భుతమైన నటనను ప్రదర్శించే అజిత్.. సరైన కథ దొరికితే విశ్వరూపమే చూపిస్తాడు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ.
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష కృష్ణన్ ఇందులో అజిత్ సరసన కథానాయికగా నటించడం విశేషం. తను ఎంత మంచి నటి అనేది అందరికీ తెలిసిందే. హీరోలకు సరిసమానంగా నటనను ప్రదర్శించగలిగే అతికొద్దిమంది నటీమణులలో ఆమె ఒకరు. సినిమాలో తన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. అర్జున్ సర్జా మరోసారి కీలక పాత్రలో మెరిశాడు. అలాగే ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు మిగిలిన నటులు తమ పాత్రల పరిధి మేరకు డీసెంట్‌గా నటించారు.
ఇక సినిమా టెక్నికల్‌గా హై స్టాండర్డ్ లో ఉంది. టెక్నిషియన్స్ విషయానికొస్తే.. అనిరుద్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. చాలా సన్నివేశాలను తన మార్క్ బీజీఎం తో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. బీజీఎం తోనే కొన్ని సీన్స్ హైలైట్ అయ్యాయి. అలాగే పాటల్లో సైతం తన మ్యాజిక్ చూపించాడు అనిరుద్.
ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఎస్సెట్ అని చెప్పొచ్చు. అజిత్‌ని బిగ్ స్క్రీన్‌పై చాలా అందంగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా అనిపిస్తుంది. విజువల్స్, లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇంకా సుందర్ కంపోజ్ చేసిన స్టంట్స్ అయితే అదిరిపోయాయి. మామూలుగానే అజిత్ సినిమాలలో యాక్షన్ ఘట్టాలకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దీనికి తగ్గట్టే ఈ మూవీలో కూడా పలు యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తాయి.
అలాగే ఎడిటింగ్ విషయానికొస్తే, కోలీవుడ్‌లో పలు హిట్ సినిమాలకు పనిచేసిన ఎన్.బి.శ్రీకాంత్ ఈ చిత్రంతో మరోసారి తన పనితనాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఉందంటే అందుకు ఆయన ఎడిటింగే కారణం. చాలా షార్ప్‌గా ఉండి సినిమాపై ఆసక్తిని కోల్పోకుండా చేసింది. ఆర్ట్ డైరెక్టర్‌గా మిలాన్ వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉండి నిర్మాతలు ఖర్చుకి ఎక్కడ వెనుకాడలేదని అర్ధమవుతుంది.
ఓవరాల్‌గా పట్టుదల సినిమా ఆడియెన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కేవలం అజిత్ అభిమానులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి పట్టుదలతో అజిత్ ఖాతాలో మరో హిట్ పడినట్టే. చాలాకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న ఆయన ఈ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు. ఈ చిత్రంతో అజిత్ మరోసారి రేసులోకొచ్చినట్టే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: