బాబాయ్ – అబ్బాయి… విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు. హిందీలో తెరకెక్కగా 2023 లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ విమర్శలను మూటగట్టుకుంది.బూతు డైలాగులు వుండటమే ఇందుకు కారణం.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ ఇమేజ్ వున్న వెంకటేష్ ఇందులో వుండే సరికి చాలా మందిపెదవి విరిచారు.కానీ వ్యూస్ పరంగా సెన్సేషన్ సృష్టించింది.ఇక రానా నాయుడు సీజన్ 2 కూడా రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్ కూడా పూర్తయినట్లే. దీనికి సంబంధించిన టీజర్ ను వదిలారు.కేవలం హిందీ టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు.అయితే ఫస్ట్ సీజన్ లా కాకుండా ఈసీజన్ 2 కి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వున్నారు.ఓన్లీ కంటెంట్ మాత్రమే నమ్ముకొన్నట్లు అనిపిస్తుంది.అసభ్యత లేకుండా యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ను కట్ చేశారు. త్వరలోనే రానా నాయుడు సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ లోకి రానుంది.కరణ్ అన్షుమాన్ ,సుపర్ణ్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా వెంకటేష్ ,రానా ,అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదిలావుంటే ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నా తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు వెంకటేష్.ఈసినిమా నిన్నటితో 300కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. రీజినల్ మూవీ గా వచ్చి ఈ ఫీట్ సాధించింది. అంతేకాదు ఈ సినిమాతో సీనియర్ హీరోల్లో 300కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి హీరోగా వెంకీ రికార్డులోకి ఎక్కాడు. ఓవరాల్ గా చూస్తే తెలుగులో 6వ హీరో. ఇప్పటికీ ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది.అనిల్ రావిపూడి ఈసినిమాను డైరెక్ట్ చేయగా దిల్ రాజు -శిరీష్ నిర్మించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























