గత కొన్నేళ్లుగా తెలుగునాట రీ-రిలీజ్‌ల పర్వం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి అత్యాధునిక టెక్నాలజీకి అనుగుణంగా మార్పులుచేర్పులు చేసి సరికొత్తగా అభిమానుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇలా ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు రీ-రిలీజై ఘనవిజయం సాధించాయి. అయితే ఇది ఉభయకుశలోపరిగా ఉండటం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతంలో చూసిన సినిమాను మళ్ళీ థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయడం మూవీ లవర్స్‌కి ఆసక్తిని కలిగిస్తుంటే.. ఆల్రెడీ ఒకసారి రిలీజ్ అయిన సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తెచ్చి కాసులు కళ్ళజూడటం నిర్మాతలకు లాభదాయకంగా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా మరో సినిమా ఈ లిస్టులోకి చేరింది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ‘గోదావరి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ఈ మూవీ మళ్లీ విడుదలవుతోంది. ఈసారి 4K టెక్నాలాజీతో సరికొత్తగా ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీ అయింది.
కాగా గోదావరి 2006లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చాలా భాగాన్ని గోదావరి నది, పాపికొండల ప్రాంతంలో చిత్రీకరించారు. సుమంత్, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించగా.. మరో జంటగా నీతూ చంద్ర, కమల్ కామరాజు కనిపించారు. అలాగే సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి, సి.వి.ఎల్.నరసింహారావు, మధుమణి, శివ, కరాటే కల్యాణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్. కె. ఎం. రాధాకృష్ణన్ సమకూర్చిన సంగీతం మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇప్పటికీ ఈ పాటలు ఎక్కడో అక్కడ వినబడుతూనే ఉంటాయి. ముఖ్యంగా ‘ఉప్పొంగెలే గోదావరి’ పాటలో లెజెండరీ సింగర్ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ అద్భుతం అనే చెప్పాలి. అలాగే ‘అందంగా లేనా’ అనే పాటను ప్రముఖ గాయని సునీత ఉపద్రష్ట అత్యద్భుతంగా ఆలపించారు.
కాగా ఈ చిత్రం శేఖర్ కమ్ములకు దర్శకుడిగా మూడోది. దీనికి ముందు ఆయన ‘ఆనంద్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఇన్ని విశేషాలున్న గోదావరి వచ్చే నెలలో మళ్ళీ థియేటర్లలోకి రానుంది. మార్చి 1వ తేదీన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా విడుదలకానుంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ ఈ క్యూట్ లవ్ స్టోరీని బిగ్ స్క్రీన్ పై మరోసారి వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























