మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కాంత శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. 1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.ఇక ఈసినిమా నుండి నిన్న దుల్కర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో దుల్కర్ రెట్రో గెటప్ లో సీరియస్ లుక్ తో కనిపించాడు. ఈసినిమాకు ప్రముఖ తెలుగు నటుడు రానా దగ్గుబాటి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దుల్కర్ తో కలిసి రానా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈఏడాది చివర్లో విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గా లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు దుల్కర్ సల్మాన్.అంతేకాదు ఈసినిమాతో మొదటి సారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బ్యాంకింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయగా నాగవంశీ -సాయి సౌజన్య నిర్మించారు.ఈసినిమాతో సీతారామం తరువాత దుల్కర్ తెలుగులో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఇక నిన్ననే మూడో సినిమా కూడా మొదలుపెట్టాడు దుల్కర్.పవన్ సాధినేని డైరెక్షన్ లో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తుంది.తనకు ఇదే మొదటి సినిమా.రమ్య గుణ్ణం,సందీప్ గుణ్ణం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇది కూడా ఈఏడాదే విడుదలకానుంది.మరి ఈసినిమాతో దుల్కర్ హ్యాట్రిక్ కొడతాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: