ఈసారి కూడా టైటిల్ కొట్టి ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలుస్తాం

CCL 2025 Telugu Warriors Captain Akhil Akkineni Attends Jersey Launch Event

CCL 11వ సీజన్ & తెలుగు వారియర్స్ థ్రిల్లింగ్ గేమ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. సెలబ్రీటీ క్రికెట్ లీగ్ (CCL) ఫిబ్రవరి 8న బెంగళూరులో 11వ సీజన్‌ను ప్రారంభం కానుంది, ఇది మైదానంలో మరపురాని క్షణాలను అందిస్తోంది. ఈ సీజన్‌లో నాలుగుసార్లు ఛాంపియన్‌లుగా తమ లెగసీ కంటిన్యూ ని చేయడానికి వారి ప్రతిష్టాత్మకమైన 5వ టైటిల్ గెలుపు కోసం సిద్ధమవుతున్న బలమైన జట్టు తెలుగు వారియర్స్ పై అందరి దృష్టి ఉంది. ఈ సందర్భంగా తెలుగు వారియర్స్ జెర్సీ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సిసిఎల్ 14 ఏళ్ల జర్నీ. గ్లింప్స్ లో చూస్తే ఓ చోట మరీ చిన్నపిల్లాడిలా కనిపించాను. సిసిఎల్ ఆడుతూ పెరిగాను. విష్ణు, సచిన్, పాషన్ తో ఇది సాధ్యపడిందని భావిస్తున్నాను. మేము నాలుగు సార్లు టైటిల్ గెలిచాం. ఈసారి కూడా టైటిల్ కొట్టి ఐదు సార్లు ఛాంపియన్ గా నిలుస్తామనే నమ్మకం వుంది. అన్నిటికంటే అందరినీ ఎంటర్ టైన్ చేయాలనే పాషన్ తో వస్తున్నాం. 14, 15 ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం. అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము’ అన్నారు

ఇక ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ.. క్రికెట్ అనేది నా చైల్డ్ వుడ్ డ్రీం. సిసిఎల్ ఫార్మెట్ నా డ్రీం ని తీర్చింది. దేశంలోని ప్రముఖ మైదానాల్లో క్రికెట్ ఆడటం ఓ అదృష్టం. అఖిల్ అగ్రెసివ్ కెప్టన్. తన ఎత్తుగడలు అద్భుతంగా వుంటాయి. తనలో చాలా ఫైర్ వుంది. క్రికెట్ మాకు చాలా ఎనర్జీ ఇస్తోంది. మాది చాలా క్రేజీ టీం. సచిన్ టీంకి ఓనర్ తో పాటు ఆటగాడిగా బిగ్గెస్ట్ స్ట్రెంత్. మూడు నెలలుగా చాలా ప్రాక్టీస్ చేశాం. ఈసారి తప్పకుండా కప్ కొడతాం. విష్ణు చాలా పాషన్ తో సీజన్స్ ని ముందుకు తీసుకుతీసుకెళ్తున్నారు. అందరికీ థాంక్ యూ సో మచ్” అని తెలిపారు.

అలాగే హీరో సచిన్ జోషి మాట్లాడుతూ.. ఇండియాలో అందరి డ్రీం క్రికెట్. ఆ డ్రీం మాకు సిసిఎల్ రూపంలో తీరింది. ఈ క్రెడిట్ విష్ణుకి ఇస్తాను. తన ఆలోచన గొప్ప విజయం సాధించింది. వెంకటేష్ గారికి థాంక్ యూ. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. మా టీం అంతా నా ఫ్యామిలీ. అన్ని సమయంలో చాలా సపోర్ట్ చేశారు. అఖిల్ పాషనేట్ క్రికెటర్. వండర్ ఫుల్ పర్శన్. తమన్ టీంలో స్పిరిట్ ని తీసుకొస్తుంటారు. మా స్పాన్సర్స్ అందరికీ థాంక్ యూ” అని అన్నారు.

ఇక CCL వ్యవస్థాపకుడు విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ.. “CCL 11వ సీజన్‌కు చేరుకోవడం మాకు గర్వకారణం. ఈ టోర్నమెంట్ ప్రత్యేకమైనది, భారతదేశంలోని చలనచిత్ర పరిశ్రమల నుండి నటీనటులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. పాల్గొనే జట్ల నైపుణ్యం, స్ఫూర్తి , దృఢ సంకల్పాన్ని చూసి మేము సంతోషిస్తున్నాము తెలుగు వారియర్స్ ఎల్లప్పుడూ టోర్నమెంట్‌కు అదనపు ఉత్సాహాన్ని తెస్తుంది” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.