తండేల్ నా కెరీర్‌లో చాలా స్పెషల్ మూవీ

Thandel is Very Special Movie in My Career, Says Naga Chaitanya

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా హాజరవగా.. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. “అతిధులకు. ప్రేక్షకులకు,అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన సందీప్ రెడ్డి వంగా గారికి థాంక్. అరవింద్ గారు వాసు లేకుండా నెక్స్ట్ సినిమా ఎలా ఫినిష్ చెస్తాననే భయం పట్టుకుంది. వారు సినిమాలో అంతలా కాంట్రిబ్యుట్ చేస్తారు. గీత ఆర్ట్స్ పేరు నా కెరీర్ లో టాప్ లో వుంటుంది.”

“తండేల్ నా కెరీర్‌లో చాలా స్పెషల్ మూవీ. తండేల్ రాజుకి, నాకు రియల్ లైఫ్‌లో చాలా డిఫరెన్స్ వుంటుంది. ఈ క్యారెక్టర్ నేను చేయగలనని నమ్మిన వాసు, చందుకి థాంక్ యూ. క్యారెక్టర్ లోకి ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వడానికి చాలా టైం ఇచ్చారు. చందుతో ఇది మూడో సినిమా. నన్ను చాలా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తాడు. సాయి పల్లవి అద్భుతమైన నటి. తనని అందరూ ఇష్టపడతారు. తను చాలా పాజిటివ్ పర్సన్.”

“ఈ సినిమాకి ట్రూ రాక్ స్టార్ దేవి. చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. డీవోపీ శ్యామ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, లిరిక్ రైటర్స్ టీం అందరికీ థాంక్ యూ. శ్రీకాకుళం వచ్చిన మత్సకారుల కుటుంబాలకి ధన్యవాదాలు. వారి వలనే నా క్యారెక్టర్‌కి ఒక ఐడియా వచ్చింది. వారికి సముద్రం తప్పితే మరొకటి తెలీదు. వారు లేకపోతే ఈ సినిమా లేదు. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఫిబ్రవరి 7 థియేటర్స్‌లో దుల్లకొట్టేద్దాం” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.