కిరణ్ అబ్బవరం K ర్యాంప్ స్టార్ట్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.ఈసినిమాతో నాని డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇక ఈసినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ వుంది.దీనికి K ర్యాంప్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.ఈసినిమా కేరళ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా రానుంది.ఇందులో కిరణ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు.యుక్తి థరేజా హీరోయిన్ గా నటిస్తుండగా చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.సామజవరగమన నిర్మాత రాకేష్ దందా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గా క తో వచ్చి కం బ్యాక్ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం.ఈసినిమా 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత కిరణ్ నెక్స్ట్ దిల్ రుబా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈసినిమాను విశ్వ కరుణ్ డైరెక్ట్ చేయగా కిరణ్ సరసన రుక్షార్ దిల్లాన్ నటించింది. నజియా డేవిసన్ కీలక పాత్రలో కనిపించనుంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సరిగమ సినిమాస్ తో కలిసి రవి ,రాకేష్ రెడ్డి నిర్మించారు.
ఫిబ్రవరిలో 14న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు అయితే ఆ డేట్ కు రావడమే డౌటే.ఎందుకంటే సినిమాకు సంబధించిన ఆర్ ఆర్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం.దాంతో ఓ వారం ఆలస్యంగా విడుదలకానుందట.త్వరలోనే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: