చైతూ, సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌ను రేపు థియేట‌ర్స్‌లో చూస్తే..

Producer Allu Aravind Praises Naga Chaitanya and Sai Pallavi's Acting in Thandel

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేస్తుంది. తాజాగా గురువారం ఈ మూవీ త‌మిళ ట్రైల‌ర్‌ను చెన్నైలో విడుద‌ల చేశారు. కోలీవుడ్ స్టార్ కార్తి ముఖ్య అతిథిగా హాజ‌రై ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంంలో డైరెక్ట‌ర్స్ కార్తీక్ సుబ్బ‌రాజ్‌, వెంక‌ట్ ప్ర‌భు స‌హా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఇక ఈ చిత్రాన్ని త‌మిళంలో డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

ఈ సంద‌ర్బంగా ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.. ‘‘మా తండేల్ సినిమా యూనిట్‌కు స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన కార్తి, కార్తీక్ సుబ్బ‌రాజ్‌, వెంక‌ట్ ప్ర‌భుల‌కు థాంక్స్‌. ఈ సినిమా కోసం ప్ర‌తీ ఒక్క‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. రేపు మీరు థియేట‌ర్స్‌కు వ‌చ్చి చూస్తే మేం ఎంత మంచి సినిమా చేశామ‌నేది తెలుస్తుంది. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌ను రేపు థియేట‌ర్స్‌లో చూసి అప్రిషియేట్ చేస్తారు.” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మా డైరెక్ట‌ర్ చందూ మొండేటిగారు అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించారు. ఇది జ‌రిగిన క‌థ‌. 20 మంది ద‌గ్గ‌ర నుంచి రైట్స్ తీసుకున్నాం. వారు పాకిస్థాన్‌లో జైలు జీవితం గ‌డిపి వ‌చ్చిన‌వారు. దాన్ని చందు రెండున్న‌ర గంటల సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. దేవిశ్రీప్ర‌సాద్ ఈ సినిమాకు మ‌రో హీరో. త‌ను 25 ఏళ్లుగా హిట్స్ ఇస్తూనే ఉన్నాడు. నాతో చాలా సినిమాల‌కు ప‌ని చేశాడు. క‌రుణాక‌ర‌న్‌ గారు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. త‌ను చ‌క్క‌గా న‌టించారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న ఎస్‌.ఆర్‌.ప్ర‌భుకి స్పెష‌ల్ థాంక్స్‌’’ అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.