సంక్రాంతి సినిమాల్లో చివరగా వచ్చి హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం తాజాగా మరో రికార్డు ను ఖాతాలో వేసుకుంది. ఈసినిమాకు నిన్నటి తో బుక్ మై షో లో 3.3 మిలియన్ల టికెట్స్ సోల్డ్ అయ్యాయి.దాంతో ఈ ఫీట్ సాధించిన మొదటి రీజినల్ మూవీగా సంక్రాంతికి వస్తున్నాం రికార్డు క్రియేట్ చేసింది. కేవలం ఒక్క తెలుగులోనే రిలీజ్ కాగా నిన్నటి వరకు 295 కోట్ల వసూళ్లను రాబట్టింది.రేపటితో 300కోట్ల క్లబ్ లో చేరనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాంతో 300 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి రీజినల్ మూవీగా నిలువనుంది.మొదటి రెండు వారాలు అదరగొట్టిన ఈసినిమా ఈవారాంతం కూడా సూపర్ వసూళ్లను సొంతం చేసుకోనుంది.అటు నార్త్ అమెరికాలో ఈసినిమా 3 మిలియన్ మార్క్ కు చేరువలో ఉంది.ఓవరాల్ గా చూస్తే ఇప్పటివరకు దాదాపు 100కోట్లకుపైగా లాభాలను తీసుకొచ్చింది.బాహుబలి 2 & 1 ,హనుమాన్ తరువాత తెలుగులో 100 కోట్ల లాభాలను తీసుకొచ్చిన నాలుగో సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం ఘనత సాధించింది.
ఇక ఈసినిమాతో కెరీర్ లో మొదటి సారి 300కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడుసీనియర్ హీరో వెంకటేష్.ఇప్పటివరకు ప్రభాస్ ,అల్లు అర్జున్ ,ఎన్టీఆర్ ,రామ్ చరణ్, తేజ సజ్జా ఈ ఫీట్ సాధించారు.ఇక ఇప్పుడు 6వ హీరోగా వెంకటేష్ రికార్డు సృష్టించనున్నాడు.
ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం ఊహించిన రెస్పాన్స్ తెచ్చుకుంటూ బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది.అనిల్ రావిపూడి ఈసినిమాను డైరెక్ట్ చేయగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మించారు.ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























