గత ఏడాది చివర్లో వచ్చి సెన్సేషన్ సృష్టించింది మలయాళ మూవీ మార్కో.మలయాళ సినిమా చరిత్రలోనే మోస్ట్ వైలెంట్ మూవీ గా తెరకెక్కింది మార్కో. ఆ తరువాత తెలుగు ,హిందీ లోకూడా విడుదలై బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి మాలీవుడ్ ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ మూవీస్ ల జాబితాలో చోటు సంపాదించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటిటి లోకి వస్తుంది.సోనీ లివ్ ఈసినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా వచ్చే నెల 14 న ఈసినిమా మలయాళంతోపాటు తెలుగు ,కన్నడ , తమిళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి రానుంది.థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన ఈసినిమా ఓటిటి లోకూడా భారీ వ్యూస్ ను సొంతం చేసుకోవడం ఖాయం.
ఇందులో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్ లో నటించగా హనీఫ్ అదేని డైరెక్ట్ చేశాడు.యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.కెజిఎఫ్, సలార్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై షరీఫ్ ముహమ్మద్ ఈసినిమాను నిర్మించారు.
ఇంతకుముందు ఉన్ని ముకుంద్ తెలుగులో భాగమతి ,జనతా గ్యారేజ్, శాకుంతలం లో నటించి ఇక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక మార్కో బ్లాక్ బస్టర్ కావడంతో దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























