ఇన్నోసెన్స్‌లా క‌నిపించే అద్భుత‌మైన యాక్ట‌ర్‌ చైతూ

Hero Karthi Praises Yuva Samrat Naga Chaitanya in Thandel Chennai Event

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేస్తుంది. తాజాగా గురువారం ఈ మూవీ త‌మిళ ట్రైల‌ర్‌ను చెన్నైలో విడుద‌ల చేశారు. కోలీవుడ్ స్టార్ కార్తి ముఖ్య అతిథిగా హాజ‌రై ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంంలో డైరెక్ట‌ర్స్ కార్తీక్ సుబ్బ‌రాజ్‌, వెంక‌ట్ ప్ర‌భు స‌హా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఇక ఈ చిత్రాన్ని త‌మిళంలో డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

ఈ సంద‌ర్బంగా హీరో కార్తి మూవీ టీమ్ కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. కార్తి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘నాకు టాలీవుడ్‌లో చాలా గొప్ప ప్రేమ దొరికింది. తండేల్ మూవీ 2018లో జ‌రిగిన రియ‌ల్ స్టోరీ అని తెలిసి ఆశ్చ‌ర్య‌పోయాను. మ‌న జాలర్లు పాకిస్థాన్‌కు వెళ్లి అక్క‌డి వారికి దొరికిపోవటం, అక్క‌డి నుంచి త‌ప్పించుకుని రావ‌టం.. ఇదంతా చ‌క్క‌టి ప్రేమ క‌థ‌గా తెర‌కెక్కించారు.”

“20 మంది ద‌గ్గ‌ర రైట్స్ తీసుకుని, మూడేళ్లు స్క్రిప్ట్ తయారు చేసి, ఏడాదిన్న‌ర పాటు షూటింగ్ చేశారంటే ఆ సినిమా అంటే వాళ్లకెంత ఇష్ట‌మో అర్థం చేసుకోవ‌చ్చు.చందు మొండేటి కెరీర్‌లో చాలా హిట్ మూవీస్ చేశారు. అదే కోవ‌లో ఈ సినిమాను ఎంత‌గానో న‌మ్మి ఈ సినిమా కోసం అద్భుత‌మైన సినిమాగా చేశారు.”

“అల్లు అర‌వింద్‌గారు చాలా ఏళ్లుగా నిర్మాత‌గా కొనసాగుతున్నారంటే మామూలు విష‌యం కాదు.. కేవ‌లం బిజినెస్ మాత్ర‌మే కాదు, ప్యాష‌న్ కూడా ఉండాలి. ఆయ‌న ద‌గ్గ‌ర చాలా విష‌యాలు నేర్చుకోవాలి. తండేల్ చాలా పెద్ద స‌క్సెస్‌ను సాధించాలి. క‌రుణాక‌ర‌న్ తెలుగులోనూ గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఒక చిన్న సీన్ ఉన్నా, ఓ న‌టుడిగా త‌న టాలెంట్‌ను చూపించే కొద్ది మంది న‌టుల్లో ఆయ‌న ఒక‌రు.”

“దేవిశ్రీప్ర‌సాద్ గొప్ప మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటాడు. త‌న‌కు అభినంద‌న‌లు. సాయిప‌ల్ల‌వి చేసే ప్ర‌తీ పాత్ర‌ను అద్భుతంగా చేస్తుంది. ప్ర‌తీ ఎమోష‌న్‌ను చ‌క్క‌గా ప‌లికిస్తుంది. అందుక‌నే అంద‌రికీ త‌ను ఎంత‌గానో న‌చ్చుతుంది. ఎ.ఎన్‌.ఆర్‌గారు, నాగార్జున‌ గారితో ఇక్క‌డి వారికి మంచి అనుబంధం ఉంది. నేను నాగార్జున‌ గారితో క‌లిసి ప‌ని చేశాను కూడా. నాతో మంచి అనుబంధం ఉంది.”

“నాగ చైత‌న్య ఇన్నోసెన్స్‌లా క‌నిపించే అద్భుత‌మైన యాక్ట‌ర్‌. త‌నపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించ‌కుండా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. తండేల్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఫిబ్రవ‌రి 7న రిలీజ్ అవుతోన్న‌ సినిమా త‌మిళంలో పెద్ద హిట్ అవుతుంది. సినిమాను త‌మిళంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప్ర‌భుకి అభినంద‌న‌లు’’ అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.