రామ్ పోతినేని 22 షూటింగ్ అప్డేట్

Rapo 22 second schedule shooting begins yesterday

డబుల్ ఇస్మార్ట్ తరువాత యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తన 22 వ సినిమాలో నటిస్తున్నాడు.రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది.నిన్ననే హైదరాబాద్ లో ఈషెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఇందులో లీడ్ పెయిర్ పై కాలేజ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.రెగ్యులర్ యాక్షన్ సినిమాలను పక్కన పెట్టి రామ్ ఈసారి మంచి లవ్ స్టోరీతో రానున్నాడు.త్వరలోనే ఈసినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు. ఇక ఈసినిమాలో కీలక పాత్ర కోసం ఓ సీనియర్ హీరోను తీసుకోనున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిస్ శెట్టి మిస్టర్ శెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.ఈఏడాది చివర్లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఇక గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ తో వచ్చిన రామ్ కు ఆ సినిమా భారీ షాక్ ఇచ్చింది.దాంతో తన 22వ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఫ్యాన్స్ కూడా ఈసినిమా తో రామ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడని బలంగా నమ్ముతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.