నాగ చైతన్య,సాయి పల్లవి ల తండేల్ మరో 8రోజుల్లో ప్రేక్షకులముందుకు రానుంది.సాంగ్స్ ,ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేశాయి.ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. అందులో భాగంగా తమిళంలో ఈరోజు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.కార్తీ చేతుల మీదుగా తమిళ వెర్షన్ ట్రైలర్ విడుదలకానుంది.ఈసినిమా తెలుగు ,తమిళ్ తోపాటు హిందీలో కూడా విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తండేల్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి .యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.మేకర్స్ సినిమాకు పర్ఫెక్ట్ రన్ టైమ్ ను సెట్ చేశారు. టైటిల్, క్రెడిట్స్ అన్ని కలుపుకొని 2గంటల 32 నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది.సోలోగా విడుదలకావడం సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.హిట్ టాక్ వస్తే 100కోట్ల సినిమా కానుంది. అయితే తమిళం లో మాత్రం తండేల్ కు పోటీ ఎదురుకానుంది.ఈసినిమాకు ఒక్క రోజు ముందు అజిత్, విడా ముయార్చి రిలీజ్ అవుతుంది.తెలుగులో ఈసినిమా పట్టుదల గా రిలీజ్ కానుంది.ఈసినిమా వల్ల ఇక్కడ మాత్రం తండేల్ కు ఎలాంటి నష్టం కలుగదు.
శ్రీకాకుళంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా చందు మొడేంటి ఈసినిమాను తెరకెక్కించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ ఈసినిమాను నిర్మించారు. మరి తండేల్ నాగ చైతన్య కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: