ఉస్తాద్ రామ్ – డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా డబుల్ ఇస్మార్ట్. బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా భారీ అంచనాల మధ్య గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పూర్తిగా నిరాశపరిచింది.ఆతరువాత ఓటిటి లోకి వచ్చినా అక్కడ కూడా సేమ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే హిందీ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ ను ఆర్ కె డి స్టూడియోస్ యూట్యూబ్ లో రిలీజ్ చేయగా నెలలో 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది.అంతేకాదు 1మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రామ్ హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టించడం ఇది మొదటి సారి కాదు.ఇంతకుముందు నేను శైలజ 600 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టగా ఉన్నది ఒకటే జిందగీ , ఇస్మార్ట్ శంకర్ సినిమాలు 300 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి.ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తక్కువ రోజుల్లోనే 100 మిలియన్ల క్లబ్ లో చేరింది.
ఇదిలావుంటే రామ్, డబుల్ ఇస్మార్ట్ తరువాత ప్రస్తుతం తన 22 వ సినిమాలో నటిస్తున్నాడు.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రామ్ సరసన మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. లవ్ స్టోరీ గా వస్తున్న ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని రామ్ చూస్తున్నాడు.త్వరలోనే ఈసినిమా టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: