మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ మూవీ ఆగస్టు లోపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత వీఎఫ్ఎక్స్ పనులపై దృష్టి పెట్టనుంది. కాగా విశ్వంభర ఈ ఏడాది సమ్మర్‌లో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మెగా అభిమానుల కోసం చిత్ర యూనిట్ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది. విశ్వంభర టీమ్ ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా ఉంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక విశ్వంభర చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా చిరంజీవి, కీరవాణి, వశిష్ట మరియు చంద్రబోస్ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది చిత్ర యూనిట్. అలాగే ఈ చిత్రంలో పాటలు పాడుతున్న అనేకమంది మేల్ అండ్ ఫిమేల్ సింగర్స్ కీరవాణితో కలిసున్న మరో ఫొటోను కూడా దీనికి జత చేసింది. మెగాస్టార్-కీరవాణి కాంబినేషన్‌లో ఇంతకుముందు అనేక చార్ట్ బస్టర్‌లు వచ్చాయి. దీంతో విశ్వంభర సినిమాపై కూడా అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
కాగా మెగాస్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం పేరొందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్, శ్రీ శివశక్తి దత్తా లిరిక్ రైటర్స్ కాగా.. శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: