గతేడాది ‘హరోం హర, మా నాన్న సూపర్ హీరో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ ‘నవ దళపతి’ సుధీర్ బాబు తాజాగా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. “యాక్షన్‌తో కూడిన, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగే జటాధార మీ మనసును కదిలించబోతుంది. షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది” అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు హీరో సుధీర్ బాబు.
ఇక ఈ క్రేజీ ప్రాజెక్టులో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ జీ స్టూడియోస్ భాగస్వామ్యం కానుంది. శివన్ నారంగ్, ప్రేర్నా అరోరా, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుండగా.. ఇందులో నటించనున్న ఇతర నటీనటులు, పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: