ద‌ళ‌ప‌తి 69 టైటిల్, ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Thalapathy 69 Titled as Jana Nayagan and First Look Released

‘గోట్’ చిత్రంతో గతేడాది బ్లాక్ బస్టర్ కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో, ద‌ళ‌ప‌తి విజ‌య్ ఇటీవలే రాజ‌కీయ‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. త‌మిళ వెట్రి క‌ళ‌గం (TVK) అనే పార్టీని స్థాపించిన ఆయన.. ఇకపై సినిమాలు మానేస్తానని, మిగిలిన జీవితాన్ని పూర్తిగా రాజ‌కీయాలకే అంకితం చేస్తానని ప్రకటించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో విజయ్ తన కెరీర్ లో చివరి చిత్రంగా ‘ద‌ళ‌ప‌తి69’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌కి తాజాగా టైటిల్ ప్రకటించారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఈ మూవీకి ‘జ‌న నాయ‌గన్’ (ప్ర‌జ‌ల నాయ‌కుడు) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే మూవీ నుంచి విజయ్ ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ గమనిస్తే.. బ్యాక్‌గ్రౌండ్‌లో యువ‌త‌తో సెల్ఫీ దిగుతున్న‌ట్లు ఫ‌స్ట్ లుక్ ఉంది.

కాగా ఈ సినిమాకు ‘ఖాకీ’ ఫేమ్ హెచ్.వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. క‌న్న‌డ నాట టాప్ బ్యాన‌ర్ గా పేరొందిన కేవీఎన్ ప్రోడ‌క్ష‌న్ ఈ మూవీని గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 2025న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.