గత ఏడాది సంక్రాంతి కి భారీ పోటీ మధ్య చిన్న సినిమాగా వచ్చింది హనుమాన్ . ఈసినిమా విడుదల ముందు వరకు అసలు చెప్పిన టైంకి విడుదలవుతా అని సందేహాలు.తీరా రిలీజైనా చాలా తక్కువ థియేటర్లు దొరికాయి.అయితే రిలీజ్ తరువాత టాక్ తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రోజు రోజు కి థియేటర్ల సంఖ్య తోపాటు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోయింది. పండుగ తరువాత కూడా ఎక్కడా తగ్గకుండా వసూళ్ళతో సెన్సేషన్ సృష్టించింది. ఆఏడాది తెలుగులో ఫోర్త్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.మీడియం బడ్జెట్ సినిమాల్లో మాత్రం మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది.అంతేకాదు ఈసినిమా చాలా రికార్డు లు బ్రేక్ చేసింది. ఒక్క తెలుగు లోనే కాదు హిందీ లోను ఈసినిమా సూపర్ వసూళ్లను దక్కించుకుంది.ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 300కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకొని బయ్యర్లకు ఊహించని లాభాలు తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఇదే దారిలో వెళ్తుంది సంక్రాంతికి వస్తున్నాం. ఈసినిమా కూడా పోటీ లోనే వచ్చింది.అయితే పెద్ద సినిమాగా విడుదలకు ముందు భారీ హైప్ తో వచ్చింది.రిలీజ్ అయ్యాక ఆ హైప్ ను అందుకొని పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుందండం తో చాలా చోట్ల టికెట్ దొరకని పరిస్థితి. పండగ తరువాత కూడా ఇదే రాంపేజ్ కొనసాగిస్తుంది. నాలుగో రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంది. దాదాపు 17కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. దాంతో మొత్తం 85కోట్ల షేర్ మార్క్ ను దాటింది.ఒక్క నైజాం లోనే 14కోట్లకుపైగా రాబట్టింది. ఫుల్ రన్ లో 25కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేయనుంది.
ఈరోజు రేపు కూడా డబుల్ డిజిట్ షేర్ ను రాబట్టుకోనుంది. ఫుల్ రన్ లో ఈసినిమా 300కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది. కేవలం సింగల్ లాంగ్వేజ్ లోనే విడుదలై జాతర కొనసాగిస్తోంది.మొత్తానికి గత సంక్రాంతికి హనుమాన్ వీరవిహారం చేయగా ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం రచ్చ చేస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: