నీ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయని, ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించిందని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన డాకు మహారాజ్’ సక్సెస్ సెలబ్రేషన్స్ వేదికగా సంగీత దర్శకుడు ఎస్. థమన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒక ప్రత్యేక పోస్ట్ పంచుకున్నారు. థమన్ ఆలోచనలను మెచ్చుకున్న మెగాస్టార్, తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల థమన్ కి ఉన్న ఇష్టాన్ని, ప్రేమను కొనియాడారు. సరదాగా ఉండే తనలో ఇంత ఆవేదన వుండడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో.. అని చిరంజీవి సహానుభూతి ప్రదర్శించారు.
ఇంతకూ థమన్ ఏమన్నారంటే..?
“సక్సెస్ అనేది చాలా గొప్పది, అది ఇచ్చే కిక్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఫ్లయింగ్ హై షైన్‌లో ఉంది. సినిమాని కాపాడడం మన అందరి బాధ్యత. నిర్మాత మనకు దేవుడితో సమానం. ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలుగు వైపు చూస్తోంది. మనమే మన సినిమాని చంపేసుకుంటే బాధగా ఉంది. అలా ఏ సినిమాకీ జరగకూడదు. తెలుగు సినిమా గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి హీరో అభిమానికీ ఉంది” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోల్స్ భయం కలిగిస్తోంది, సిగ్గుగా కూడా అనిపిస్తోంది. ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతుంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల వాళ్ళు మన తెలుగు సినిమా చేయాలి అని భావిస్తున్నారు. ఇతర భాషల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా తెలుగు సినిమాకి ఎంతో గౌరవం ఉంది. కానీ మనం మాత్రం మన సినిమాను ట్రోలింగ్స్‌తో చంపుకుంటున్నాం. ట్రోల్స్ తో మన పరువుని మనమే తీసుకోవద్దు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా థమన్ తాజాగా మ్యూజిక్ అందించిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలు ఇటీవలే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటున్నాయి.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: