యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గా క తో వచ్చి ఎట్టకేలకు సక్సెస్ చూశాడు.ఈసినిమా 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమా తరువాత కిరణ్ నెక్ట్ దిల్ రుబా తో రానున్నాడు.లవ్ &యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో కిరణ్ సరసన రుక్షార్ దిల్లాన్ నటించింది. మరో నటి నజియా డేవిసన్ కీలక పాత్రలో కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.ఇక ఈ టీజర్ అయితే ప్రామిసింగ్ గా వుంది.టీజర్ లోనే దాదాపుగా స్టోరీని రివీల్ చేశారు. మ్యాగీ అనే అమ్మాయి తో లవ్ ఫెల్యూర్ తరువాత వీటన్నింటికి దూరంగా ఉంటున్న హీరో జీవితంలోకి మరో అమ్మాయి రావడం ఆతరువాత తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.ఇది దిల్ రుబా స్టోరీ.సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో హైలైట్ అయ్యింది.మరి ఈసినిమా తో కిరణ్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
విశ్వ కరుణ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా సరిగమ సినిమాస్ తో కలిసి రవి ,రాకేష్ రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.ఇక ఈసినిమా తరువాత కిరణ్ ఇంతవరకు మరో సినిమాను అనౌన్స్ చేయలేదు.అయితే క హిట్ కావడంతో క 2 కూడా రానుందని కిరణ్ ఇంతకుముందే ప్రకటించాడు.దాంతో దిల్ రుబా రిలీజ్ తరువాత కిరణ్ అబ్బవరం,క 2 ను ప్రారంభించే ఛాన్స్ లేకపోలేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: