ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో చివరి సినిమాగా వస్తుంది సంక్రాంతికి వస్తున్నాం.అయితే బజ్ మాత్రమే మిగిలిన రెండు సినిమాలకు సమానంగా వుంది.ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ కావడం తో సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.యూట్యూబ్ లో ఈ మూడు పాటలు ఇప్పటివరకు 87 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈనెల 6న కీలకమైన ట్రైలర్ కూడా విడుదలకానుంది.నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో ఈ ట్రైలర్ ఈవెంట్ జరుగనుంది.ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ అంతా హాజరు కానుంది.ఈసినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.హిట్ టాక్ వస్తే సంక్రాంతికి వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం మరో ఎఫ్ 2 కావడం పక్కా.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈసినిమాలో ఐశ్వర్య రాజేష్,మీనాక్షిచౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తుండగా జనవరి 14న థియేటర్లోకి రానుంది.అయితే ఈసినిమాకన్నా ముందు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ,బాలకృష్ణ డాకు మహారాజ్ సంక్రాంతికి బరిలోకి దిగుతున్నాయి.దాంతో ఈ సారి పోటీ ఆసక్తిగా ఉండనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























