పుష్ప 2 గ్లోబల్ వైడ్ గా దుమ్మురేపుతోంది.ఈసినిమా విడుదలై మూడు వారాలైనా ఎక్కడా స్లో అవ్వకుండా దూసుకుపోతుంది.నిన్నటి తో మూడు వారాల రన్ ను పూర్తి చేసుకోగా ప్రపంచ వ్యాప్తంగా 1705కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో కేవలం 21 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2 రికార్డు సృష్టించింది.అంతేకాదు హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన రెండో తెలుగు సినిమాగాను రికార్డు క్రియేట్ చేసింది.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ తో బాహుబలి 2 మొదటి స్థానంలో వుంది. ఫుల్ రన్ లో పుష్ప 2 ఈ కలెక్షన్స్ దాటేస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా పుష్ప 2 తెలుగు &హిందీ వెర్షన్లు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.హిందీలో అయితే ఓ రేంజ్ లో డామినేషన్ కొనసాగిస్తుంది.ఇప్పటికే అక్కడ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించగా ఫుల్ రన్ లో 800కోట్ల మార్క్ ను దాటేయనుంది.ఇంతకుముందు స్త్రీ 2 627కోట్ల తో హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది. అయితే పుష్ప కేవలం రెండు వారాల్లోనే ఆ రికార్డు ను బ్రేక్ చేసింది.21 రోజుల్లో పుష్ప 2 దేశవ్యాప్తంగా 731.25కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.
ఇక పుష్ప 2 తెలుగు వెర్షన్ కూడా జోరు కొనసాగిస్తోంది.నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 300కోట్ల షేర్ ను మార్క్ నీ చేరుకుంది. దాంతో కల్కి లైఫ్ టైం కల్లెక్షన్స్ ను దాటేసింది. ఓవర్సీస్ లోకూడా సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది.ఇప్పటివరకు 35మిలియన్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది. ఓటిటి విషయానికి వస్తే 56రోజుల తరువాతే స్ట్రీమింగ్ లోకి రానుంది. ఆ లెక్కన వచ్చే నెల చివర్లో ఓటిటి లో అందుబాటులోకి రానుంది.అన్ని భాషలకు గాను నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: