తెలుగు సినిమా పుష్ప 2 హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.ఇప్పటికీ ఇదే జోరు కొనసాగిస్తుండడం తో ఇప్పుడప్పుడే బాక్సాఫీస్ వద్ద స్లో అయ్యే ఛాన్స్ అయితే కనబడడడం లేదు.కొత్తగా రిలీజైనా సినిమాలకు మించి అక్కడ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది.నిన్న క్రిస్మస్ హాలిడే కావడంతో 15.50కోట్ల వసూళ్లను రాబట్టింది.అదే రోజు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ కూడా రిలీజ్ అయ్యింది.ఈసినిమా మొదటి రోజు 11.50కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అంటే పుష్ప 2 డామినేషన్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో చూడొచ్చు.21 రోజుల్లో పుష్ప హిందీ వెర్షన్ దేశవ్యాప్తంగా 731.25కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో పక్కా గా 800కోట్ల మార్క్ ను దాటనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పుష్ప 2 హిందీలోనే కాదు గ్లోబల్ వైడ్ గా మూడో వారంలో కూడా ఏమాత్రం స్లో అవ్వకుండా సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ అదరగొట్టింది.ఏపీ, తెలంగాణాలో నిన్నటితో 290కోట్ల షేర్ మార్క్ దాటేసింది.అటు ఓవర్సీస్ లోకూడా సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది.నార్త్ అమెరికాలో నిన్నటితో 15 మిలియన్ల వసూళ్లను రాబట్టింది దాంతో అక్కడ ఆర్ఆర్ఆర్ లైఫ్ టైం కలెక్షన్స్ ను దాటేసింది.
సంక్రాంతి వరకు సినిమాలు లేకపోవడం 56 రోజుల తరువాతే ఓటిటి లోకి వచ్చే ఛాన్స్ ఉండడంతో మరికొన్ని రోజులు పుష్ప 2 ఇదే జోరు కొనసాగించనుంది.ఇక బుక్ మై షో లో నిన్నటి వరకు 18 మిలియన్లకుపైగా టికెట్ సేల్స్ జరిగాయి.ఇప్పటివరకు ఇదే హైయెస్ట్.ఇంతకుముందు కెజిఎఫ్ 2కు ఫుల్ రన్ లో 17.7 మిలియన్ల టికెట్ సేల్స్ జరిగాయి.పుష్ప 2 ఆ రికార్డు బ్రేక్ చేసింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: