ఇండియా గర్వించదగ్గ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కేవలం మనదేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా కోట్లాదిమందిని అలరించి సెన్సేషన్ సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ సహా అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సైతం గెలుపొంది అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ మల్టీ స్టారర్ ప్రపంచవ్యాప్తంగా 1,200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ సృష్టించింది. ఇంతటి విశేష ప్రాముఖ్యత కలిగిన ఈ మూవీపై ఓ స్పెషల్ డాక్యుమెంటరీ వస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ అనే పేరుతో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది.
కాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మేకింగ్ సందర్భంగా జరిగిన సంఘటనలు, పోరాట ఘట్టాల రూపకల్పనకు సంబంధించిన షూటింగ్ విశేషాలతో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. అయితే ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇది డిసెంబర్ 27నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ దీనిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: