గేమ్ చేంజర్‌లో ఆ నాలుగు సీన్స్ అద్భుతం..

Game Changer Pre Release Event Director Buchi Babu Praises Film Maker S Shankar

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. “శంకర్ గారి సినిమాలు చూస్తూ మేం పెరిగాం. పిఠాపురంలో పూర్ణ థియేటర్లో భారతీయుడు సినిమా చూశాను. కమర్షియల్ యాంగిల్స్‌లో సినిమా తీయడంలో శంకర్ గారు గ్రేట్. ఆయనలా ఇంకెవ్వరూ తీయలేరు. గేమ్ చేంజర్‌లో ఓ నాలుగు సీన్స్ చూశాను. అద్భుతంగా ఉన్నాయి. రామ్ చరణ్ గారు నన్ను బాగా అర్థం చేసుకుంటారు. నేను సమస్యలని చెప్పకపోయినా ఆయన అర్థం చేసుకుంటారు. మా గురువు గారిని దిల్ రాజు గారు డైరెక్టర్‌ని చేశారు. గేమ్ చేంజర్ పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.