గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశారు

Director Shankar Praises Global Star Ram Charan at Game Changer Pre-Release Event

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.శంకర్ చిత్ర విశేషాలు వివరించారు. శంకర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “దిల్ రాజు గారు చాలా బాగా మాట్లాడారు. సినిమా గురించి అంతా చెప్పేశారు. నేను ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాను. ఇక్కడకు రావాలా? వద్దా? అనుకున్నాను. కానీ మీ అందరి కోసం వచ్చాను. పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. కానీ అందులో కూడా నా మార్క్ ఉండాలని అనుకున్నాను. అలాంటి ఓ సినిమానే గేమ్ చేంజర్.”

“తమిళంలో, హిందీలో చిత్రాలు చేశాను. కానీ నేను ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. అయినా మీరు నా మీద ప్రేమను చూపిస్తూనే వచ్చారు. చిరంజీవి గారితో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అది జరగలేదు. ఆ తరువాత మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాను. ఆపై ప్రభాస్‌తో కరోనా టైంలో చర్చలు జరిగాయి. కానీ వర్కౌట్ కాలేదు. రామ్ చరణ్‌తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉంది. అందుకే ఈ గేమ్ చేంజర్ వచ్చింది.”

“గవర్నమెంట్ ఆఫీసర్, పొలిటీషియన్ మధ్య వచ్చే ఘర్షణ, వార్ మీదే ఈ చిత్రం ఉంటుంది. రామ్ చరణ్ గారు ఎంతో సటిల్డ్‌గా నటించారు. కాలేజ్ లుక్‌లో చాలా ఫైర్ ఉంటుంది. పంచెకట్టులో అప్పన్నగా అద్భుతంగా నటించారు. సాంగ్స్‌లో అదిరిపోయే స్క్రీన్ ప్రజెన్స్, అద్భుతమైన డ్యాన్స్‌లతో రామ్ చరణ్ మెస్మరైజ్ చేశారు. ఒక్కో సీన్, ఒక్కో డైలాగ్‌ను ఎస్ జే సూర్య ఎంతో అద్భుతంగా చేశారు. అంజలి గారు న్యాచులర్ యాక్టర్. సర్ ప్రైజ్ అండ్ షాకింగ్‌గా ఆమె పాత్ర ఉంటుంది.”

“శ్రీకాంత్ గారు, బ్రహ్మానందం గారు, సునీల్ గారు,వెన్నెల కిషోర్ గారు ఇలా చాలా మంది సినిమా కోసం పని చేశారు. దిల్ రాజు అంతా తానై ముందుకు నడిపించారు. ప్రతీ రోజూ సెట్స్ మీదకు వచ్చి అన్ని పనుల్ని చక్కబెట్టేవారు. అదే ఆయన సక్సెస్ మంత్రం. కెమెరామెన్‌ తిరుతో ముందుగానే ఇన్ ఫ్రా రెడ్ టెక్నాలజీ గురించి చెప్పాను. దోప్ సాంగ్‌కి లక్షకు పైగా చిన్న చిన్న లైట్లను వాడాం. జరగండి పాట కోసం ఓ సెట్‌లో ఓ విలేజ్‌ను క్రియేట్ చేశాం. సాబూ సిరిల్ గారు అద్భుతంగా సెట్ వేశారు.”

“అలాగే తల తిప్పుకోనివ్వకుండా రూబెన్ ఈ మూవీని ఎడిట్ చేశారు. తెలుగు సినిమాలో తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలని అనుకున్నాను. రెహమాన్ గారే నా సినిమాలకు సంగీతాన్ని ఇస్తుంటారు. తమన్ మీద చాలా బాధ్యత, ఒత్తిడి ఉండేది. కానీ ఆయన అద్భుతమైన పాటల్ని ఇచ్చారు. సుకుమార్ పుష్ప 2తో పెద్ద విజయాన్ని అందుకున్నారు. మా కోసం ఇక్కడకు వచ్చిన సుకుమార్ గారికి థాంక్స్. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు అద్భుతమైన విజయాన్ని అందుకోబోతోన్నారు. సోషియో, పొలిటికల్, మాస్ ఎంటర్టైనర్‌గా గేమ్ చేంజర్ రాబోతోంది” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.