బచ్చల మల్లి తిరునాళ్లకు స్టార్ హీరో, హీరోయిన్

Kiran Abbavaram and Samyuktha Menon To Attend Bachhala Malli Thirunaallu

హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘బచ్చల మల్లి’గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సహా ఇతర ప్రచార చిత్రాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి ‘మా ఊరి జాతరలో’, ‘అదే నేను.. అసలు లేను’, ‘మరీ అంత కోపం’ అనే పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుని మార్కెట్‌లో మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు మేకర్స్. దీనిలో భాగంగా నేడు ‘బచ్చల మల్లి తిరునాళ్లు’ పేరుతో ఓ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ తిరునాళ్లకు టాలీవుడ్ లోని ఒక స్టార్ హీరో, ఒక స్టార్ హీరోయిన్ హాజరుకానున్నారు. కిరణ్ అబ్బవరం, సంయుక్త మీనన్ ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.

ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ దగ్గర గల వెస్ట్ఇన్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు బచ్చల మల్లి చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ఇతర ముఖ్య తారాగణం.

‘మానాడు, రంగం, మట్టి కుస్తి’ వంటి చిత్రాలకు పని చేసిన రిచర్డ్ ఎమ్ నాథన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, సంభాషణలను దర్శకుడు సుబ్బు మంగదేవి స్వయంగా రాశారు, స్క్రీన్‌ప్లేను విప్పర్తి మధు రాశారు, విశ్వనేత్ర అడిషినల్ స్క్రీన్‌ప్లే సహకారాన్ని అందించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.