శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ట్రైలర్ రిలీజ్

Vennela Kishore's Srikakulam Sherlock Holmes Trailer Unveiled

టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌’. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రాన్ని ‘క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు’ చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేష్, మచ్చ రవి, ప్రభావతి, సంగీత, శుభోదయం సుబ్బారావు, శివమ్ మల్హోత్రా, వాజ్‌పేయి ఇద్రీమా నాగరాజు, MVN కశ్యప్ తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

మేరీ అనే యువతి హత్య సంచలనంగా మారడంతో బీచ్‌లో జరిగే వరుస హత్యల చుట్టూ కథ తిరుగుతుంది. కేసును ఛేదించలేక, పోలీసులు క్రియేటివ్, కాలిక్యులేటివ్ ఎప్రోచ్ తో పాపులరైన ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమిస్తారు. డిటెక్టివ్ గ్రామంలోని ప్రేమజంటతో సహా అనుమానితులను ఏడుగురిని గుర్తిస్తాడు.

రైటర్ మోహన్ కథను ఎంగేజింగ్, సస్పెన్స్‌గా ప్రజెంట్ చేశారు. వెన్నెల కిషోర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టైటిల్ క్యారెక్టర్‌ కు జీవం పోశాడు. అతని హ్యుమర్ బిహేవియర్ ఉన్నప్పటికీ, కేసును పరిష్కరించడంలో అతని పద్దతి, తెలివితేటలు ఆకట్టుకునేలా ఉనాయి. రవితేజ మహద్యం, అనన్య నాగళ్ల ప్రేమ జంటగా నటించగా, సీయా గౌతమ్ పోలీస్ కానిస్టేబుల్‌గా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ ఇతర ముఖ్య తారాగణం.

మల్లికార్జున్ ఎన్ సినిమాటోగ్రఫీ థ్రిల్లర్ టెన్షన్ యు క్యాప్చర్ చేస్తూ ప్రత్యేకంగా నిలిచింది. సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ జానర్‌కి పెర్‌ఫెక్ట్‌గా వున్నాయి. అవినాష్ గుర్లింక్ ఎడిటింగ్ నిర్వహిస్తుండగా, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. ఆర్ట్ డైరెక్టర్‌గా బేబీ సురేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజేష్ రామ్ బాల్ వ్యవహరిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.