సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ‘UI ది మూవీ’ తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇక ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన, నిర్మాత ఎస్.కే.ఎన్ అతిధులుగా హాజరయ్యారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూపర్ స్టార్ ఉపేంద్ర చిత్ర విశేషాలు వివరించారు. ఉపేంద్ర ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ఇండస్ట్రీకి కృతజ్ఞతలు. ఇండియానే కాదు.. వరల్డ్‌నే షేక్ చేస్తోంది టాలీవుడ్. 1000 కోట్లు, 2000 కోట్లు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. అయినప్పటికీ ఒక చిన్న టాలెంట్‌ని చూసి కూడా గొప్పగా ఆదరిస్తున్నారు.”
“దానికి నేనే నిదర్శనం. మీ ప్రేమను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. బుచ్చిబాబు గారి ఉప్పెన సినిమా చూసి షాక్ అయ్యాను. ఆయన ఫస్ట్ సినిమాలా అనిపించలేదు. రామ్ చరణ్ గారితో నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. ఐ విష్ హిం ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ‘బేబీ’ సినిమా నాకు చాలా నచ్చింది. అలాంటి ఆలోచన దర్శక నిర్మాతలకు ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోయాను.”
నిర్మాత ఎస్ కే ఎన్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. వారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు చిరంజీవి గారి ఫ్యామిలీతో 30 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆయనతో ఒక సినిమా చేయాలని వన్ ఇయర్ ట్రావెలయ్యాను. అప్పుడే తెలుగు ఇండస్ట్రీ స్పెషాలిటీ అర్థమైంది. తెలుగు ఆడియన్స్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.”
“ఇక నేను 20 ఏళ్ల క్రితం చేసిన సినిమాల్ని ఇంకా గుర్తుపెట్టుకుని నన్ను ఇంత గొప్పగా ఆదరిస్తున్నారు. మీ అందరి ప్రేమ, ప్రోత్సాహం చూస్తుంటే ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలని తపన కలుగుతుంది. ఈ గొప్పతనం అంతా ప్రేక్షకులదే.” అని పేర్కొన్నారు హీరో ఉపేంద్ర.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































