జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్

Icon Star Allu Arjun Released From Chanchalguda Jail Today

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ శుక్రవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించగా.. హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కి మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తొలుత నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలమేరకు పోలీసులు అల్లు అర్జున్‌ను చంచ‌ల్‌గూడ జైలుకి తరలించారు. మరోవైపు హీరో తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగిసి, ఉత్తర్వులు వచ్చేలోపు పోలీసులు ఆయనను జైలు లోపలకి తీసుకెళ్లారు. అల్లు అర్జున్‌కి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేసినప్పటికీ ఆ డాక్యుమెంట్స్ చంచ‌ల్‌గూడ జైలు అధికారులకు చేరేసరికి దాదాపు అర్ధరాత్రి అయింది. దీంతో రూల్స్ ప్రకారం, ఆయనను నేటి ఉదయం రిలీజ్ చేశారు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ చంచ‌ల్‌గూడ జైలు నుంచి శ‌నివారం ఉద‌యం 6.40 గంట‌ల‌కు విడుద‌ల‌య్యారు. అయితే భద్రత నిమిత్తం ఆయనను జైలు వెనుక గేటు నుంచి అధికారులు బ‌య‌ట‌కు పంపించారు. అనంతరం జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాల‌యానికి చేరుకున్నారు అర్జున్‌. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ నివాసం వ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.