టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే చేయని తప్పునకు హీరోని బాధ్యుడిని చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఘటనలో మహిళా అభిమాని మృతి చెందడం నిజంగా బాధాకరం, దురదృష్టకరం. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది. అకారణంగా ఇద్దరు చిన్న పిల్లలు తల్లి లేనివారయ్యారు. వారు జీవితాంతం కన్నతల్లికి దూరమై పెరగాల్సి ఉంటుంది. అలాగే ఆ భర్తకి సైతం జీవిత భాగస్వామి దూరమవ్వడం అనే బాధను ఎవరూ తీర్చలేరు. ఒకరకంగా ఆ ఫ్యామిలీకి ఇది కోలుకోలేని దెబ్బ.
అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన మరో అంశం ఉంది. జరిగిన ఘటనలో హీరో అల్లు అర్జున్ ప్రమేయం ఉందా? అసలు ఆయన చేసిన తప్పు ఏంటి? పుష్ప 2 చిత్రం కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డారు అల్లు అర్జున్. వాస్తవానికి ఒక హీరో ఒక మూవీ కోసం ఇంత సమయం వెచ్చించడం అంటే మాటలు కాదు, ఎంతో డెడికేషన్ ఉండాలి. అలాగే సినిమాపై ఎంతో ప్యాషన్ ఉండాలి. అల్లు అర్జున్‌కి ఈ రెండూ పుష్కలంగా ఉన్నాయి.
ఆరోజు సంధ్య థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూసి ఆనందించాలని, మూడేళ్లుగా తాను పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలనుకొని బెనిఫిట్ షో చూడడానికి వచ్చారు అల్లు అర్జున్. అయితే దురదృష్టవశాత్తూ అక్కడ జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోవడం బాధాకరం. కానీ ఈ విషయం అల్లు అర్జున్‌కు ఒక రోజు ఆలస్యంగా తెలిసింది. తెలిసిన వెంటనే ఆయన స్పందించారు.
జరిగిన ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన అల్లు అర్జున్ బాధిత కుటంబానికి రూ.25 లక్షలు అందించడమే కాకుండా ఇకపై వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాననని కూడా ప్రకటించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే..? జరిగినదానిలో తన తప్పు లేకపోయినా మానవత్వంతో స్పందించి ఆ ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు అల్లు అర్జున్.
అయితే కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇప్పుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదుచేయడం, ఆయనను అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించగా.. హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కి మధ్యంతర బెయిల్ మంజూరుచేయడంతో ఆయన కుటుంబసభ్యులు మరియు అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఎవరూ ఊహించని పరిణామం. అక్కడ ఒక నిండు ప్రాణం బలికావడం ఘోరం. ఇందులో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా చేసిన తప్పేమీ లేదు. ఎక్కడా ఉద్రేక పూరిత ప్రసంగాలు చేయలేదు. ఎవరినీ రెచ్చగొట్టలేదు, నిందించలేదు. జస్ట్ అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకున్నాడు, అంతే. కానీ ఈరోజు ఆయన పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇక్కడ జరిగినదానిలో మనందరి తప్పు ఉంది. దీనికి ఏ ఒక్క వ్యక్తినో బాధ్యుడిని చేయడం తగదు.
ఈ సంఘటనను అందరూ ఒక పాఠంగా తీసుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు కేవలం హీరోలనే బాధ్యులను చేయకుండా అభిమానులు కూడా తమ వంతు బాధ్యతగా జాగ్రత్తగా మసలుకోవాలి. తద్వారా ఇలాంటి సంఘటనలు మున్ముందు మరోసారి జరుగకుండా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి. అభిమానం ఉండటంలో తప్పులేదు. కానీ అది మితిమీరితేనే ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని గుర్తించి అందరం బాధ్యతగా మెలుగుదాం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: