టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ కేసు హైకోర్టు పరిధిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆయనకు రిమాండ్ విధించిన నేపథ్యంలో హైకోర్టు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో దీనిపై స్పందించారు బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్. అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన ఆయన ఇలాంటి ఘటనలకు నటులను బాధ్యులను చేయడం తగదని వ్యాఖ్యానించారు.
ఈమేరకు తాజాగా తన లేటెస్ట్ మూవీ ‘బేబీ జాన్’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. “సేఫ్టీ ప్రోటోకాల్ అనే విషయంలో విఫలమైతే అది కేవలం నటుడి ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు. మన చుట్టూ ఉండే వారికి తెలియజేయవచ్చు. పుష్ప 2 విడుదల రోజు జరిగిన సంఘటన విషాదకరమైనది.. ఈ విషయంలో నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. కానీ ఈ ఘటనలో ఎవరో ఒకరిపై మాత్రమే నిందలు వేయలేం” అని స్పష్టం చేశారు.
ఇక మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో నాని కూడా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. “సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు మరియు మీడియా షో లాంటి ఉత్సాహం సాధారణ పౌరులకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మనం మంచి సమాజంలో జీవించేవాళ్లం.” అని తెలిపారు.
ఇంకా ఆయన ఇలా చెప్పారు.. “ఇది దురదృష్టకర సంఘటన మరియు ఇది హృదయ విదారకంగా ఉంది. మనమందరం విపత్తు నుండి నేర్చుకోవాలి మరియు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఇది మళ్లీ జరగకుండా చూసుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది. దీనికి ఒక వ్యక్తి బాధ్యత వహించడు” అని తన వైఖరిని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: