హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’గా రాబోతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ ‘మరీ అంత కోపం’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పాటను గమనిస్తే, హీరో అంతర్గత సంఘర్షణ, పశ్చాత్తాపానికి గురిచేసేలావుంది. హార్ట్ టచ్చింగ్‌గా సాగిన ఈ సాంగ్ సినిమాలో హీరో అల్లరి నరేష్ తన పాస్ట్ యాక్షన్స్, తప్పులు, అతని ఈగో, ఎడిక్షన్స్ యొక్క ప్రభావాన్ని ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా అతని హృదయంలో చెలరేగే అంతర్గత సంఘర్షణను ఈ పాట ప్రజెంట్ చేస్తోంది.
పూర్ణా చారి రాసిన లిరిక్స్ హ్యూమన్ ఎమోషన్స్ ఇంపాక్ట్ ఫుల్ గా చూపించాయి. విశాల్ చంద్రశేఖర్ ఆర్కెస్ట్రేషన్, క్లాసిక్ కంపోజిషన్ మనసుని హత్తుకుంది. సాయి విఘ్నేష్ వోకల్స్ ట్రాక్ ఎమోషన్స్ ఎలివేట్ చేసే హానెస్టిని తీసుకొచ్చింది. అల్లరి నరేష్, అమృత అయ్యర్ పాటు ఇతర ప్రముఖ తారాగణాన్ని కూడా చూపించే ఈ సౌంగ్ ఇంటెన్స్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, థర్డ్ సింగిల్ కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని చూపింది. కాగా ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ఇతర ముఖ్య తారాగణం.
మానాడు, రంగం, మట్టి కుస్తి వంటి చిత్రాలకు పని చేసిన రిచర్డ్ ఎమ్ నాథన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, సంభాషణలను దర్శకుడు సుబ్బు మంగదేవి స్వయంగా రాశారు, స్క్రీన్‌ప్లేను విప్పర్తి మధు రాశారు, విశ్వనేత్ర అడిషినల్ స్క్రీన్‌ప్లే సహకారాన్ని అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: