హీరో అల్లు అర్జున్ అరెస్ట్

Icon Star Allu Arjun Arrested by Hyderabad Police

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల ఆయన నటించిన ‘పుష్ప 2: ది రూల్’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన ఘటనలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చిన సమయంలో భద్రతాపరంగా సరైన ఏర్పాట్లు చేయకపోవడం కారణంగా యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. థియేటర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్‌ను చిక్కడ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

అయితే అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు ఉద్రిక్తతకు దారితీసాయి. ఆయన అరెస్ట్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై హీరో అసహనం వ్యక్తం చేశారు. “అరెస్ట్ చేయడంలో తప్పు లేదని.. అయితే ఇందుకోసం అనుమతి లేకుండా తమ బెడ్ రూమ్ వరకూ రావడం తప్పు” అని అల్లు అర్జున్ పోలీసులతో వ్యాఖ్యానించారు.

అసలు ఏం జరిగిందంటే..?

పుష్ప 2 చిత్రం రిలీజ్ సందర్భంగా ముందురోజు డిసెంబర్‌ 4వ తేదీ రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో బెనిఫిట్ షో ఏర్పాటుచేశారు. దీనికి హీరో అల్లు అర్జున్ కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా అభిమానులు భారీగా తరలిరావడంతో పోలీసులు వీరిని చెదరగొట్టే క్రమంలో థియేటర్ వద్ద తోపులాట చోటుచేసుకుంది.

దురదృష్టవశాత్తూ ఈ ఘటనలో రేవతి (39) అనే మహిళ మరియు ఆమె కుమారుడు శ్రీతేజ్‌ (9) సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే పోలీసులు వారికి సపర్యలు అందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఈ ఘటనలో రేవతి మృతిచెందగా.. శ్రీతేజ్‌ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఒకరోజు ఆలస్యంగా తెలియదంతో అల్లు అర్జున్‌ స్పందించారు. ఈ మేరకు జరిగిన ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షలు సాయం ప్రకటించాడు. అలాగే బాలుడి చికిత్సకు అయ్యే ఖర్చులను కూడా తానే భరిస్తానని, ఆమె కుటుంబానికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.