డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

Daaku Maharaaj First Single out on 14th December

సీనియర్ హీరో బాలకృష్ణ ,యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా డాకు మహారాజ్.షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మొదటి పాట ను రిలీజ్ చేయనునున్నారు.ఈ శుక్రవారం ఈ సాంగ్ విడుదలకానుండగా రేపు ఉదయం 10:08 గంటలకు సాంగ్ ప్రోమో బయటికి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో బాలకృష్ణ ను ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా చూపించనున్నాడు బాబీ. యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న డాకు మహారాజ్ లో శ్రద్దా శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ ,చాందిని చౌదరి కీలక పాత్రల్లో కనిపించనుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో మెరవనున్నాడు.తమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ , శ్రీకర స్టూడియోస్ , ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.జనవరి 12న విడుదలకానుంది. ఈసినిమా హిట్ అయితే బాలకృష్ణ వరుసగా నాలుగో హిట్ పడనుంది. ఇంతకుముందు అఖండ ,వీరసింహ రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు.

ఇక బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్నాడు.నిన్ననే ఈసినిమా షూటింగ్ సార్ట్ అయ్యింది.అఖండ కు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.14రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.